సంఖ్యాకాండం Chapter 32 TELIRV Bible Verse Images

సంఖ్యాకాండం 32 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share సంఖ్యాకాండం 32 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


సంఖ్యాకాండం 32:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రూబేనీయులకు, గాదీయులకు, పశువులు అతి విస్తారంగా ఉండడం వలన యాజెరు, గిలాదు ప్రాంతాలు మందలకు తగిన స్థలమని వారు గ్రహించారు.

సంఖ్యాకాండం 32:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు మోషేతో, యాజకుడు ఎలియాజరుతో సమాజ నాయకులతో

సంఖ్యాకాండం 32:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“అతారోతు, దీబోను, యాజెరు, నిమ్రా, హెష్బోను, ఏలాలే, షెబాము, నెబో, బెయోను అనే ప్రాంతాలు,

సంఖ్యాకాండం 32:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అంటే ఇశ్రాయేలు ప్రజలందరి ఎదుట యెహోవా జయించిన దేశం పశువుల మందలకు అనువైంది. మీ సేవకులైన మాకు మందలు ఉన్నాయి.

సంఖ్యాకాండం 32:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి మా మీద మీకు దయ కలిగితే, మమ్మల్ని యొర్దాను నది దాటించవద్దు. మాకు ఈ దేశాన్ని వారసత్వంగా ఇవ్వండి” అన్నారు.

సంఖ్యాకాండం 32:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు మోషే గాదీయులకు, రూబేనీయులకు ఇలా జవాబిచ్చాడు. “మీ సోదరులు యుద్ధాలు చేస్తూ ఉంటే మీరు ఇక్కడే ఉండిపోవచ్చా?

సంఖ్యాకాండం 32:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన దేశానికి వెళ్ళకుండా మీరు వారి హృదయాలను ఎందుకు నిరుత్సాహ పరుస్తున్నారు?

సంఖ్యాకాండం 32:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ దేశాన్ని చూసి రావడానికి కాదేషు బర్నేయలో నేను మీ తండ్రులను పంపినప్పుడు వారు కూడా ఇలాగే చేశారు కదా.

సంఖ్యాకాండం 32:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు ఎష్కోలు లోయలోకి వెళ్లి ఆ దేశాన్ని చూసి ఇశ్రాయేలు ప్రజలను అధైర్యపరిచారు కాబట్టి యెహోవా తమకిచ్చిన దేశంలో ప్రవేశించలేకపోయారు.

సంఖ్యాకాండం 32:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ రోజు యెహోవా కోపం తెచ్చుకున్నాడు.

సంఖ్యాకాండం 32:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇరవై సంవత్సరాలకు మించి, ఐగుప్తుదేశం నుండి వచ్చిన మనుషుల్లో యెహోవాను పూర్ణ మనస్సుతో అనుసరించిన కెనెజీయుడు, యెఫున్నె కొడుకు కాలేబు, నూను కొడుకు యెహోషువ తప్ప

సంఖ్యాకాండం 32:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మరి ఎవ్వడూ పూర్ణమనస్సుతో నన్ను అనుసరించలేదు కాబట్టి నేను అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ఇస్తానని ప్రమాణం చేసిన దేశాన్ని మరి ఎవరూ చూడనే చూడరు, అని శపథం చేశాడు.

సంఖ్యాకాండం 32:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు ఇశ్రాయేలు ప్రజల మీద యెహోవా కోపం రగులుకోవడం వల్ల ఆయన దృష్ఠికి చెడుతనం చూపిన ఆ తరం వారంతా నాశనం అయ్యే వరకూ వారిని అరణ్యంలో తిరిగేలా చేశాడు.

సంఖ్యాకాండం 32:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల మీద యెహోవాకు మరింత కోపం పుట్టించేలా ఆ పాపుల పిల్లలైన మీరు వారి స్థానంలో బయలుదేరారు.

సంఖ్యాకాండం 32:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు ఆయన్ని అనుసరించకుండా వెనక్కి తగ్గిపోతే ఆయన ఈ ప్రజలందరినీ ఈ అడవిలోనే నిలిపివేస్తాడు. ఆ విధంగా మీరు ఈ ప్రజలందరి నాశనానికి కారకులౌతారు.”

సంఖ్యాకాండం 32:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందుకు వారు అతనితో “మేము ఇక్కడ మా పశువుల కోసం దొడ్లూ, మా పిల్లల కోసం ఊరులూ కట్టుకుంటాం.

సంఖ్యాకాండం 32:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇశ్రాయేలు ప్రజలను వారివారి స్థలాలకు చేర్చే వరకూ మేము యుద్ధానికి సిద్ధపడి వారి ముందు సాగిపోతాం. అయితే మా పిల్లలు ఈ ప్రాంత ప్రజల భయం వలన ప్రాకారాలున్న ఊర్లలో నివసించాలి.

సంఖ్యాకాండం 32:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇశ్రాయేలీయుల్లో ప్రతివాడూ తన తన వారసత్వాన్ని పొందేవరకూ మా ఇళ్ళకు తిరిగి రాము.

సంఖ్యాకాండం 32:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తూర్పున యొర్దాను ఇవతల మాకు వారసత్వం దొరికింది కాబట్టి ఇక యొర్దాను అవతల వారితో వారసత్వం అడగం” అన్నారు.

సంఖ్యాకాండం 32:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు మోషే వారితో “మీరు మీ మాట మీద నిలబడి యెహోవా సన్నిధిలో యుద్ధానికి సిద్ధపడి యెహోవా తన ఎదుటనుండి తన శత్రువులను వెళ్లగొట్టే వరకూ

సంఖ్యాకాండం 32:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా సన్నిధిలో మీరంతా యొర్దాను అవతలికి వెళ్ళి

సంఖ్యాకాండం 32:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ దేశాన్ని జయించిన తరవాత మీరు తిరిగి రావచ్చు. మీరు యెహోవా దృష్టికీ ఇశ్రాయేలీయుల దృష్టికీ నిర్దోషులుగా ఉంటారు. అప్పుడు ఈ దేశం యెహోవా సన్నిధిలో మీకు వారసత్వం అవుతుంది.

సంఖ్యాకాండం 32:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు అలా చేయకపోతే యెహోవా దృష్టికి పాపం చేసిన వారవుతారు కాబట్టి మీ పాపం మిమ్మల్ని పట్టుకొంటుందని తెలుసుకోండి.

సంఖ్యాకాండం 32:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు మీ పిల్లల కోసం ఊర్లను, మీ పశువుల కోసం దొడ్లను కట్టుకుని మీరు చెప్పిన ప్రకారం చేయండి అన్నాడు.”

సంఖ్యాకాండం 32:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందుకు గాదీయులు, రూబేనీయులు మోషేతో “మా యజమానివి నువ్వు ఆజ్ఞాపించినట్టు నీ సేవకులైన మేము చేస్తాం.

సంఖ్యాకాండం 32:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మా పిల్లలు, భార్యలు, మా ఆవుల మందలు గిలాదు ఊళ్ళలో ఉంటారు.

సంఖ్యాకాండం 32:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ సేవకులైన మేము, అంటే మా సైన్యంలో ప్రతి యోధుడు మా యజమానివి నువ్వు చెప్పినట్టు యెహోవా సన్నిధిలో యుద్ధం చేయడానికి యొర్దాను అవతలికి వస్తాము” అన్నారు.

సంఖ్యాకాండం 32:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి మోషే వారిని గురించి యాజకుడైన ఎలియాజరుకు, నూను కుమారుడు యెహోషువకు, ఇశ్రాయేలు గోత్రాల్లో పూర్వీకుల వంశాల నాయకులకు ఇలా ఆజ్ఞాపించాడు,

సంఖ్యాకాండం 32:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“గాదీయులు, రూబేనీయులు అందరూ యెహోవా సన్నిధిలో యుద్ధానికి సిద్దపడి మీతో కూడా యొర్దాను అవతలికి వస్తే, ఆ దేశాన్ని మీరు జయించిన తరవాత మీరు గిలాదు దేశాన్ని వారికి వారసత్వంగా ఇవ్వాలి.

సంఖ్యాకాండం 32:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాని వారు యుద్ధానికి సిద్ధపడి మీతో కలిసి అవతలకి రాకపోతే వారు కనాను దేశంలో మీ మధ్యనే వారసత్వం పొందుతారు”

సంఖ్యాకాండం 32:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దానికి గాదీయులు, రూబేనీయులు “యెహోవా నీ సేవకులైన మాతో చెప్పినట్టే చేస్తాం.

సంఖ్యాకాండం 32:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మేము యెహోవా సన్నిధిలో యుద్ధానికి సిద్ధపడి నది దాటి కనాను దేశంలోకి వెళ్తాం. అప్పుడు యొర్దాను ఇవతల మేము వారసత్వం పొందుతాం” అని జవాబిచ్చారు.

సంఖ్యాకాండం 32:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు మోషే వారికి, అంటే గాదీయులకు, రూబేనీయులకు, యోసేపు కుమారుడు మనష్షే అర్థగోత్రం వారికి, అమోరీయుల రాజైన సీహోను రాజ్యాన్ని, బాషాను రాజైన ఓగు రాజ్యాన్ని, వాటి ఊళ్ళన్నిటినీ ఆ దేశాల చుట్టూ ఉన్న గ్రామాలనూ ఇచ్చాడు.

సంఖ్యాకాండం 32:34 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
గాదీయులు దీబోను, అతారోతు, అరోయేరు, అత్రోతు, షోపాను,

సంఖ్యాకాండం 32:35 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యాజెరు, యొగ్బెహ, బేత్నిమ్రా, బేత్హారాను

సంఖ్యాకాండం 32:36 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అనే ఊళ్ళలో ప్రాకారాలు, పశువుల దొడ్లు కట్టుకున్నారు.

సంఖ్యాకాండం 32:37 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రూబేనీయులు హెష్బోను, ఏలాలే, కిర్యతాయిము, నెబో, బయల్మెయోను,

సంఖ్యాకాండం 32:38 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
షిబ్మా అనే ఊళ్లు కట్టి, వాటికి కొత్త పేర్లు పెట్టారు.

సంఖ్యాకాండం 32:39 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మనష్షే సంతానం అయిన మాకీరీయులు గిలాదుపై దండెత్తి దాన్ని ఆక్రమించి దానిలోని అమోరీయులను వెళ్లగొట్టారు.

సంఖ్యాకాండం 32:40 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మోషే మనష్షే కొడుకు మాకీరుకు గిలాదును ఇచ్చాడు.

సంఖ్యాకాండం 32:41 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతని సంతానం అక్కడ నివసించింది. మనష్షే కొడుకు యాయీరు వెళ్లి అక్కడి గ్రామాలను ఆక్రమించి వాటికి యాయీరు గ్రామాలు అని పేరు పెట్టాడు.

సంఖ్యాకాండం 32:42 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నోబహు వెళ్లి కెనాతును దాని గ్రామాలను ఆక్రమించి దానికి నోబహు అని తన పేరు పెట్టాడు.

Available Bible Translations

American Standard Version
Numbers 32 (ASV) »
King James Version
Numbers 32 (KJV) »
GOD’S WORD® (GW)
Numbers 32 (GW) »
World English Bible
Numbers 32 (WEB) »
Louis Segond 1910
Nombres 32 (LSG) »
Luther Bibel 1912
Numeri 32 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
गिनती 32 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਗਿਣਤੀ 32 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
গননা 32 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
எண்ணாகமம் 32 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
गणना 32 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
ગણના 32 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಅರಣ್ಯಕಾಂಡ 32 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلْعَدَد 32 (AVD) »
תנ ך עברי מודרני
במדבר 32 (HEB) »
Bíblia Sagrada Português
Números 32 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Dân Số 32 (VIE) »
Reina Valera Antigua
Números 32 (RVA) »
La Sacra Bibbia
Numeri 32 (RIV) »
圣 经 简体中文和合本
民 数 记 32 (CUVS) »
聖 經 繁體中文和合本
民 數 記 32 (CUVT) »
Bibla e Shenjtë
Numrat 32 (ALB) »
Svenska Bibeln 1917
4 Mosebok 32 (SV1917) »
Библия на русском
Числа 32 (RUSV) »
Українська Біблія
Числа 32 (UKR) »
Szent Biblia - Magyar
4 Mózes 32 (KAR) »
Българска Библия
Числа 32 (BULG) »
聖書 日本語
民数記 32 (JPN) »
Biblia Takatifu
Hesabu 32 (SWHULB) »
Kitaabka Quduuska Ah
Tirintii 32 (SOM) »
De Heilige Schrift
Numberi 32 (NLD) »

సంఖ్యాకాండం (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List