సంఖ్యాకాండం Chapter 22 TELIRV Bible Verse Images

సంఖ్యాకాండం 22 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share సంఖ్యాకాండం 22 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


సంఖ్యాకాండం 22:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తరువాత ఇశ్రాయేలీయులు ప్రయాణం చేసి యెరికోకు ఎదురుగా యొర్దాను తీరంలో ఉన్న మోయాబు మైదానాల్లో శిబిరం వేసుకున్నారు.

సంఖ్యాకాండం 22:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సిప్పోరు కొడుకు బాలాకు ఇశ్రాయేలీయులు అమోరీయు పట్ల చేసిందంతా చూశాడు.

సంఖ్యాకాండం 22:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ప్రజలు ఎక్కువగా ఉన్న కారణంగా మోయాబీయులు వారిని చూసి చాలా కంగారుపడ్డారు. మోయాబీయులు ఇశ్రాయేలీయులను చూసి భయభ్రాంతులకు లోనయ్యారు.

సంఖ్యాకాండం 22:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మోయాబీయులు మిద్యాను పెద్దలతో “ఒక ఎద్దు పొలంలో ఉన్న పచ్చిగడ్డి తినేసినట్టు ఈ జనసమూహహం ఇప్పుడు మన చుట్టూ ఉన్నదంతా తినేస్తారు” అన్నారు. ఆ కాలంలో సిప్పోరు కొడుకు బాలాకు మోయాబీయులకు రాజు.

సంఖ్యాకాండం 22:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి అతడు బెయోరు కొడుకు బిలామును పిలవడానికి అతని ప్రజల దేశంలో ఉన్న నది దగ్గర ఉన్న పెతోరుకు ఇలా కబురంపారు. “చూడు, ఒక జాతి ఐగుప్తులోనుంచి వచ్చింది. వారు ఈ ప్రదేశమంతా కమ్మి, ఇప్పుడు నాకు ఎదురు గుండా శిబిరం వేసుకున్నారు.

సంఖ్యాకాండం 22:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి నువ్వు దయచేసి వచ్చి నా కోసం ఈ జనాన్ని శపించు. వారు నాకంటే చాలా బలవంతులు. ఒకవేళ నేను వారి మీద దాడి చేసి వారిని ఈ ప్రదేశం నుంచి తరమగలుగుతానేమో. ఎందుకంటే నువ్వు దీవించినవాడికి దీవెన, శపించిన వాడికి శాపం కలుగుతాయని నాకు తెలుసు” అని అన్నాడు.

సంఖ్యాకాండం 22:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి మోయాబు పెద్దలు, మిద్యాను పెద్దలు భవిష్యవాణి చెప్పడానికి ఇచ్చే చెల్లింపు తీసుకుని బిలాము దగ్గరికి వచ్చి బాలాకు మాటలు అతనితో చెప్పారు.

సంఖ్యాకాండం 22:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు వారితో “ఈ రాత్రి ఇక్కడే ఉండండి. యెహోవా నాకు చెప్పిన మాటలు నేను మళ్ళీ వచ్చి మీతో చెప్తాను” అన్నాడు. అప్పుడు మోయాబు నాయకులు ఆ రాత్రి బిలాము దగ్గర ఉన్నారు.

సంఖ్యాకాండం 22:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దేవుడు బిలాము దగ్గరికి వచ్చి “నీ దగ్గరున్న ఈ మనుషులు ఎవరు?” అన్నాడు.

సంఖ్యాకాండం 22:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బిలాము దేవునితో “సిప్పోరు కొడుకు బాలాకు అనే మోయాబు రాజు వార్త పంపించి,

సంఖ్యాకాండం 22:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
‘చూడు, ఒక జాతి ఐగుప్తునుంచి బయలుదేరి వచ్చింది. వారు ఈ ప్రదేశమంతా కమ్మి ఉన్నారు. నువ్వు వెంటనే వచ్చి నా కోసం వారిని శపించు. ఒకవేళ నేను వారి మీద దాడి చేసి వారిని ఈ ప్రదేశం నుంచి తరమగలుగుతానేమో’ అని వీళ్ళతో నాకు వార్త పంపించాడు” అన్నాడు.

సంఖ్యాకాండం 22:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దేవుడు బిలాముకు జవాబిస్తూ “నువ్వు వారితో వెళ్లకూడదు. ఆ ప్రజలను శపించకూడదు. వారు ఆశీర్వాదం పొందిన వారు” అన్నాడు.

సంఖ్యాకాండం 22:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి బిలాము ఉదయాన లేచి, బాలాకు నాయకులతో “మీరు మీ స్వదేశానికి వెళ్ళి పొండి. మీతో వెళ్ళడానికి యెహోవా నాకు అనుమతి ఇవ్వలేదు” అన్నాడు.

సంఖ్యాకాండం 22:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి మోయాబు నాయకులు లేచి బాలాకు దగ్గరికి వెళ్లి “బిలాము మాతో రావడానికి నిరాకరించాడు” అని చెప్పారు.

సంఖ్యాకాండం 22:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బాలాకు వారికంటే ఘనత కలిగిన ఇంకా ఎక్కువ మంది నాయకులను మళ్ళీ పంపించాడు.

సంఖ్యాకాండం 22:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు బిలాము దగ్గరికి వచ్చి అతనితో “సిప్పోరు కొడుకు బాలాకు, ‘నువ్వు నా దగ్గరికి రావడానికి దయచేసి ఏదీ నిన్ను ఆపనివ్వకు,

సంఖ్యాకాండం 22:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎందుకంటే, నేను నిన్ను చాలా గొప్పవాణ్ణి చేస్తాను. నువ్వు నాతో ఏం చెప్పినా చేస్తాను. కాబట్టి నువ్వు దయచేసి వచ్చి, నా కోసం ఈ జనాన్ని శపించు’ అని చెప్పమన్నాడు” అన్నారు.

సంఖ్యాకాండం 22:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బిలాము జవాబిస్తూ “బాలాకు తన రాజమందిరమంత వెండి బంగారాలు నాకిచ్చినా, నేను చెయ్యాల్సిన పని చిన్నదైనా పెద్దదైనా, నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మీరలేను.

సంఖ్యాకాండం 22:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి కూడా ఇక్కడ ఉండండి. యెహోవా నాతో ఇంకేం చెప్తాడో నేను తెలుసుకుంటాను” అన్నాడు.

సంఖ్యాకాండం 22:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ రాత్రి దేవుడు బిలాము దగ్గరికి వచ్చి “ఆ మనుషులు నిన్ను పిలిపించారు గనక నువ్వు లేచి వారితో వెళ్ళు. కాని కేవలం నేను నీతో చెప్పినట్టే నువ్వు చెయ్యాలి” అని చెప్పాడు.

సంఖ్యాకాండం 22:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఉదయాన బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు నాయకులతోపాటు వెళ్ళాడు.

సంఖ్యాకాండం 22:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు వెళ్తూ ఉన్నప్పుడు, దేవుని కోపం రగులుకుంది. యెహోవా దూత అతనికి విరోధంగా దారిలో అడ్డంగా నిలిచి ఉన్నాడు. అతడు తన గాడిద ఎక్కి వెళ్తూ ఉన్నప్పుడు, అతని పనివారు ఇద్దరు అతనితోపాటు ఉన్నారు.

సంఖ్యాకాండం 22:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా దూత కత్తి దూసి, దారిలో నిలిచి ఉండడం ఆ గాడిద చూసింది గనక అది దారి మళ్ళి పొలంలోకి వెళ్ళింది. బిలాము గాడిదను దారిలోకి మళ్ళించాలని దాన్ని కొట్టాడు.

సంఖ్యాకాండం 22:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా దూత అటూ ఇటూ గోడలున్న ద్రాక్షతోటల సందులో నిలిచాడు.

సంఖ్యాకాండం 22:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
గాడిద యెహోవా దూతను చూసి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమింది గనక అతడు మళ్ళీ దాన్ని కొట్టాడు.

సంఖ్యాకాండం 22:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా దూత ముందుకు వెళ్లి, కుడికైనా ఎడమకైనా తిరగడానికి దారిలేని ఇరుకు ప్రాంతంలో నిలిచినప్పుడు,

సంఖ్యాకాండం 22:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ గాడిద యెహోవా దూతను చూసి బిలాముతోబాటు కింద పడిపోయింది గనక బిలాము మండిపడ్డాడు. తన చేతి కర్రతో గాడిదను కొట్టాడు.

సంఖ్యాకాండం 22:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు యెహోవా ఆ గాడిద నోరు తెరిచాడు. అది “నువ్వు నన్ను మూడుసార్లు కొట్టావు. నేను ఏమి చేశాను?” అని బిలాముతో అంది.

సంఖ్యాకాండం 22:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బిలాము “నువ్వు నన్ను ఒక వెర్రివాణ్ణి చేశావు. నా చేతిలో కత్తి ఉంటే నిన్ను చంపేసే వాణ్ణి” అన్నాడు.

సంఖ్యాకాండం 22:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ గాడిద “ఈ రోజు వరకూ నీ జీవితమంతా నువ్వు స్వారీ చేసిన నేను నీదాన్ని కాదా? నేనెప్పుడైనా నీ పట్ల ఈవిధంగా చేశానా?” అని బిలాముతో అంది. బిలాము “లేదు” అన్నాడు.

సంఖ్యాకాండం 22:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు యెహోవా బిలాము కళ్ళు తెరిచాడు గనక దూసిన కత్తి చేత్తో పట్టుకుని దారిలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూసి తల వంచి సాష్టాంగ నమస్కారం చేశాడు.

సంఖ్యాకాండం 22:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా దూత “నీ గాడిదను మూడుసార్లు ఎందుకు కొట్టావు? చూడు, నా దృష్టిలో నువ్వు దుర్మార్గమైన పనులు చేశావు గనక నేను నీకు విరోధిగా వచ్చాను.

సంఖ్యాకాండం 22:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ గాడిద నన్ను చూసి ఈ మూడుసార్లు నా ఎదుట నుంచి పక్కకు వెళ్ళింది. అది నా ఎదుట నుంచి పక్కకు వెళ్ళకపోతే కచ్చితంగా అప్పుడే నేను నిన్ను చంపి దాని ప్రాణం రక్షించి ఉండేవాణ్ణి” అని అతనితో అన్నాడు.

సంఖ్యాకాండం 22:34 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందుకు బిలాము “నేను పాపం చేశాను. నువ్వు నాకు ఎదురుగా దారిలో నిలుచుని ఉన్నావని నాకు తెలియలేదు. కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను ఎక్కడనుంచి వచ్చానో అక్కడికి వెళ్ళిపోతాను” అని యెహోవా దూతతో చెప్పాడు.

సంఖ్యాకాండం 22:35 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా దూత “నువ్వు ఆ మనుషులతోపాటు వెళ్ళు. కాని, నేను నీతో చెప్పే మాటలేగాని, ఇంకేమీ పలకొద్దు” అని బిలాముతో చెప్పాడు. అప్పుడు బిలాము బాలాకు అధికారులతో పాటు వెళ్ళాడు.

సంఖ్యాకాండం 22:36 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బిలాము వచ్చాడని బాలాకు విని, ఆ సరిహద్దు చివర ఉన్న అర్నోను తీరంలో అతన్ని కలుసుకోడానికి మోయాబు పట్టణం వరకూ వెళ్ళినప్పుడు,

సంఖ్యాకాండం 22:37 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బాలాకు బిలాముతో “నిన్ను పిలవడానికి నేను నీ దగ్గరికి రాయబారులను పంపాను గదా! నువ్వెందుకు నా దగ్గరికి రాలేదు? నిన్ను గొప్పవాణ్ణి చేసే సామర్థ్యం నాకు లేదా?” అన్నాడు.

సంఖ్యాకాండం 22:38 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు బిలాము “చూడు, నేను నీ దగ్గరికి వచ్చాను. నాకిష్టమొచ్చింది చెప్పడానికి నాకు శక్తి ఉందా? దేవుడు నా నోట పలికించే మాటే పలకగలను గదా” అని బాలాకుతో చెప్పాడు.

సంఖ్యాకాండం 22:39 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు బిలాము బాలాకుతో పాటు వెళ్ళాడు. వారు కిర్యత్‌ హుజోతుకు వచ్చినప్పుడు

సంఖ్యాకాండం 22:40 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బాలాకు ఎడ్లు, గొర్రెలు బలిగా అర్పించి, కొంతభాగం బిలాముకు, అతని దగ్గరున్న నాయకులకు పంపించాడు.

సంఖ్యాకాండం 22:41 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బాలాకు ఆ తరువాత రోజు బిలామును బయలుకు చెందిన ఎత్తైన స్థలాల దగ్గరికి తీసుకు వెళ్ళాడు. అక్కడనుంచి బిలాము ఇశ్రాయేలీయుల శిబిరంలో కొంత భాగమే చూడగలిగాడు.

Available Bible Translations

American Standard Version
Numbers 22 (ASV) »
King James Version
Numbers 22 (KJV) »
GOD’S WORD® (GW)
Numbers 22 (GW) »
World English Bible
Numbers 22 (WEB) »
Louis Segond 1910
Nombres 22 (LSG) »
Luther Bibel 1912
Numeri 22 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
गिनती 22 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਗਿਣਤੀ 22 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
গননা 22 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
எண்ணாகமம் 22 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
गणना 22 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
ગણના 22 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಅರಣ್ಯಕಾಂಡ 22 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلْعَدَد 22 (AVD) »
תנ ך עברי מודרני
במדבר 22 (HEB) »
Bíblia Sagrada Português
Números 22 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Dân Số 22 (VIE) »
Reina Valera Antigua
Números 22 (RVA) »
La Sacra Bibbia
Numeri 22 (RIV) »
圣 经 简体中文和合本
民 数 记 22 (CUVS) »
聖 經 繁體中文和合本
民 數 記 22 (CUVT) »
Bibla e Shenjtë
Numrat 22 (ALB) »
Svenska Bibeln 1917
4 Mosebok 22 (SV1917) »
Библия на русском
Числа 22 (RUSV) »
Українська Біблія
Числа 22 (UKR) »
Szent Biblia - Magyar
4 Mózes 22 (KAR) »
Българска Библия
Числа 22 (BULG) »
聖書 日本語
民数記 22 (JPN) »
Biblia Takatifu
Hesabu 22 (SWHULB) »
Kitaabka Quduuska Ah
Tirintii 22 (SOM) »
De Heilige Schrift
Numberi 22 (NLD) »

సంఖ్యాకాండం (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List