సంఖ్యాకాండం Chapter 2 TELIRV Bible Verse Images

సంఖ్యాకాండం 2 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share సంఖ్యాకాండం 2 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


సంఖ్యాకాండం 2:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా మరోసారి మోషే, అహరోనులతో మాట్లాడాడు. ఆయన ఇలా అన్నాడు.

సంఖ్యాకాండం 2:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“ఇశ్రాయేలు ప్రజల్లో ప్రతి ఒక్కరూ సైన్యంలో తమ దళానికి చెందిన పతాకం చుట్టూ, తన గోత్రాన్ని సూచించే చిన్నజెండా చుట్టూ తమ గుడారాలు వేసుకోవాలి. సన్నిధి గుడారానికి అభిముఖంగా వారి గుడారాలు ఉండాలి.

సంఖ్యాకాండం 2:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యూదా శిబిరానికి చెందిన వారు తమ సైనిక దళంతో యూదా పతాకం చుట్టూ తమ గుడారాలు వేసుకోవాలి. ఇవి సన్నిధి గుడారానికి తూర్పు దిక్కున సూర్యుడు ఉదయించే వైపున ఉండాలి. యూదా సైనిక దళానికి అమ్మీనాదాబు కొడుకు నయస్సోను నాయకత్వం వహించాలి.

సంఖ్యాకాండం 2:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యూదా దళంలో నమోదైన వారు 74, 600 మంది పురుషులు.

సంఖ్యాకాండం 2:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యూదా గోత్రం సమీపంలో ఇశ్శాఖారు గోత్రం వారు తమ శిబిరం ఏర్పాటు చేసుకోవాలి. సూయారు కొడుకు నెతనేలు ఇశ్శాఖారు గోత్రం వారి నాయకుడు.

సంఖ్యాకాండం 2:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నెతనేలుతో ఉన్న సైన్యంలో 54, 400 మంది పురుషులు నమోదయ్యారు.

సంఖ్యాకాండం 2:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇశ్శాఖారు గోత్రం వారి తరువాత జెబూలూను గోత్రం వారుండాలి. హేలోను కొడుకు ఏలీయాబు జెబూలూను గోత్రం వారి నాయకుడు.

సంఖ్యాకాండం 2:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతని దళంలో నమోదైన వారు 57, 400 మంది పురుషులు.

సంఖ్యాకాండం 2:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యూదా వారితో కలసి శిబిరం ఏర్పాటు చేసుకున్న వారు మొత్తం లెక్కిస్తే 1, 86, 400 మంది పురుషులు ఉన్నారు. వీరు మొదటగా శిబిరం నుండి కదిలి వెళ్ళాలి.

సంఖ్యాకాండం 2:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దక్షిణ దిక్కున రూబేను దళం తమ పతాకం చుట్టూ గుడారాలు వేసుకోవాలి. షెదేయూరు కొడుకు ఏలీసూరు రూబేను సైనిక దళాలకు నాయకుడు.

సంఖ్యాకాండం 2:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతని సైన్యంలో నమోదైన వారు 46, 500 మంది పురుషులు.

సంఖ్యాకాండం 2:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రూబేను గోత్రం వారి పక్కనే షిమ్యోను గోత్రం వారు తమ గుడారాలు వేసుకోవాలి. సూరీషద్దాయి కొడుకు షెలుమీయేలు షిమ్యోను గోత్రం వాళ్లకు నాయకుడు.

సంఖ్యాకాండం 2:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతని దళంలో నమోదైన వారు 59, 300 మంది పురుషులు.

సంఖ్యాకాండం 2:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తరువాత గాదు గోత్రం ఉండాలి. రగూయేలు కుమారుడు ఏలీయాసాపు గాదు గోత్రానికి నాయకత్వం వహించాలి.

సంఖ్యాకాండం 2:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతని సైన్యంలో నమోదైన వారు 45, 650 మంది పురుషులు.

సంఖ్యాకాండం 2:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి రూబేను గోత్రం వారితో కలసి శిబిరం ఏర్పాటు చేసుకున్న వారి మొత్తం లెక్కిస్తే 1, 51, 450 మంది పురుషులు ఉన్నారు. వీళ్ళంతా రెండో వరుసలో ముందుకు నడవాలి.

సంఖ్యాకాండం 2:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సన్నిధి గుడారం శిబిరం నుండి మిగిలిన గోత్రాలన్నిటి మధ్యలో లేవీయులతో కలసి ముందుకు కదలాలి. వారు శిబిరంలోకి ఏ క్రమంలో వచ్చారో అదే క్రమంలో శిబిరం నుండి బయటకు వెళ్ళాలి. ప్రతి ఒక్కడూ తన స్థానంలో ఉండాలి. తన పతాకం దగ్గరే ఉండాలి.

సంఖ్యాకాండం 2:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎఫ్రాయిము గోత్రం సన్నిధి గుడారానికి పడమటి వైపున ఉండాలి. అమీహూదు కొడుకు ఎలీషామా ఎఫ్రాయిము సైన్యాలకు నాయకత్వం వహించాలి.

సంఖ్యాకాండం 2:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎఫ్రాయిము సైన్యంగా నమోదైన వారు 40, 500 మంది పురుషులు.

సంఖ్యాకాండం 2:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మనష్షే గోత్రం వారు ఎఫ్రాయిము గోత్రం వారి పక్కనే ఉండాలి. పెదాసూరు కొడుకు గమలీయేలు మనష్షే సైన్యాలకు నాయకుడుగా ఉండాలి.

సంఖ్యాకాండం 2:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతని సైన్యంగా నమోదైన వారు 32, 200 మంది పురుషులు.

సంఖ్యాకాండం 2:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మనష్షే గోత్రం వాళ్లకు దగ్గర్లోనే బెన్యామీను గోత్రం వారుండాలి. గిద్యోనీ కొడుకు అబీదాను బెన్యామీను సైన్యాలకు నాయకుడుగా ఉండాలి.

సంఖ్యాకాండం 2:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతని సైన్యంగా నమోదైన వారు 35, 400 మంది పురుషులు.

సంఖ్యాకాండం 2:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి ఎఫ్రాయిము గోత్రం వారితో కలసి శిబిరం ఏర్పాటు చేసుకున్న వారి మొత్తం లెక్కిస్తే 1,08,100 మంది పురుషులు ఉన్నారు. వారింతా మూడో వరుసలో శిబిరం నుండి కదలాలి.

సంఖ్యాకాండం 2:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దాను శిబిరానికి చెందిన వారు తమ సైనిక దళంతో దాను పతాకం చుట్టూ తమ గుడారాలు వేసుకోవాలి. సన్నిధి గుడారానికి ఉత్తరం వైపున తమ గుడారాలు వేసుకోవాలి. అమీషదాయి కొడుకు అహీయెజెరు దాను గోత్రానికి నాయకత్వం వహించాలి.

సంఖ్యాకాండం 2:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దాను గోత్రానికి చెందిన సైన్యంగా నమోదైన వారు 62, 700 మంది పురుషులు.

సంఖ్యాకాండం 2:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతనికి దగ్గరలోనే ఆషేరు గోత్రం వారు ఉండాలి. ఒక్రాను కొడుకు పగీయేలు ఆషేరు సైన్యానికి నాయకుడుగా ఉండాలి.

సంఖ్యాకాండం 2:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతని సైన్యంగా 41, 500 మంది పురుషులు నమోదయ్యారు.

సంఖ్యాకాండం 2:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆషేరు గోత్రం వాళ్లకు దగ్గరలోనే నఫ్తాలి గోత్రం వారుండాలి. ఏనాను కొడుకు అహీర నఫ్తాలి గోత్రం వాళ్లకు నాయకుడిగా ఉండాలి.

సంఖ్యాకాండం 2:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నఫ్తాలి గోత్రం వారి సైన్యంగా నమోదైన వారు 53, 400 మంది పురుషులు.

సంఖ్యాకాండం 2:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి దాను గోత్రం వారితో కలసి శిబిరం ఏర్పాటు చేసుకున్న వారు మొత్తం లెక్కిస్తే 1, 57, 600 మంది పురుషులు ఉన్నారు. వీరు తమ ధ్వజాల ప్రకారం చివరి బృందంగా నడవాలి.”

సంఖ్యాకాండం 2:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇశ్రాయేలు ప్రజల్లో తమ తమ పూర్వీకుల కుటుంబాల ప్రకారం మోషే, అహరోనులు వీళ్ళను లెక్కించారు. వీరు మొత్తం 6,03,550 మంది పురుషులు.

సంఖ్యాకాండం 2:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే యెహోవా మోషేకి ఆజ్ఞాపించిన ప్రకారం లేవీయుల సంఖ్య లెక్కపెట్టలేదు.

సంఖ్యాకాండం 2:34 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజలు మోషేకి యెహోవా ఆజ్ఞాపించినదంతా చేసారు. వారు తమ తమ ధ్వజాల దగ్గర గుడారాలు వేసుకున్నారు. శిబిరం నుండి బయటకు వెళ్ళినప్పుడు తమ పూర్వీకుల కుటుంబాల క్రమంలో వెళ్ళారు.

Available Bible Translations

American Standard Version
Numbers 2 (ASV) »
King James Version
Numbers 2 (KJV) »
GOD’S WORD® (GW)
Numbers 2 (GW) »
World English Bible
Numbers 2 (WEB) »
Louis Segond 1910
Nombres 2 (LSG) »
Luther Bibel 1912
Numeri 2 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
गिनती 2 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਗਿਣਤੀ 2 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
গননা 2 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
எண்ணாகமம் 2 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
गणना 2 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
ગણના 2 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಅರಣ್ಯಕಾಂಡ 2 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلْعَدَد 2 (AVD) »
תנ ך עברי מודרני
במדבר 2 (HEB) »
Bíblia Sagrada Português
Números 2 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Dân Số 2 (VIE) »
Reina Valera Antigua
Números 2 (RVA) »
La Sacra Bibbia
Numeri 2 (RIV) »
圣 经 简体中文和合本
民 数 记 2 (CUVS) »
聖 經 繁體中文和合本
民 數 記 2 (CUVT) »
Bibla e Shenjtë
Numrat 2 (ALB) »
Svenska Bibeln 1917
4 Mosebok 2 (SV1917) »
Библия на русском
Числа 2 (RUSV) »
Українська Біблія
Числа 2 (UKR) »
Szent Biblia - Magyar
4 Mózes 2 (KAR) »
Българска Библия
Числа 2 (BULG) »
聖書 日本語
民数記 2 (JPN) »
Biblia Takatifu
Hesabu 2 (SWHULB) »
Kitaabka Quduuska Ah
Tirintii 2 (SOM) »
De Heilige Schrift
Numberi 2 (NLD) »
Dansk Bibel 1871
4 Mosebog 2 (DA1871) »

సంఖ్యాకాండం (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List