ద్వితీయోపదేశ కాండము Chapter 12 TELIRV Bible Verse Images

ద్వితీయోపదేశ కాండము 12 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share ద్వితీయోపదేశ కాండము 12 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


ద్వితీయోపదేశ కాండము 12:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“మీరు స్వాధీనం చేసుకోడానికి మీ పూర్వీకుల దేవుడు యెహోవా మీకిచ్చిన దేశంలో మీ జీవితకాలమంతా మీరు పాటించాల్సిన కట్టడలు, విధులు ఇవి.

ద్వితీయోపదేశ కాండము 12:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు స్వాధీనం చేసుకోబోయే జాతుల ప్రజలు గొప్ప పర్వతాల మీదా మెట్టల మీదా పచ్చని చెట్ల కిందా ఎక్కడెక్కడ వారి దేవుళ్ళను పూజించారో ఆ స్థలాలన్నిటినీ మీరు పూర్తిగా ధ్వంసం చేయాలి.

ద్వితీయోపదేశ కాండము 12:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారి హోమపీఠాలను కూలదోసి, వారి విగ్రహాలను పగలగొట్టాలి. వారి దేవతా స్తంభాలను అగ్నితో కాల్చివేసి, వారి దేవుళ్ళ ప్రతిమలను కూల్చి వెయ్యాలి. ఆ స్థలం లో వాటి పేర్లు కూడా లేకుండా నాశనం చేయాలి.

ద్వితీయోపదేశ కాండము 12:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు తమ దేవుళ్ళను ఆరాధించినట్టు మీరు యెహోవాను అరాధించకూడదు.

ద్వితీయోపదేశ కాండము 12:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీ దేవుడు యెహోవా మీ గోత్రాలన్నిటిలో నుండి తన పేరుకు నివాసస్థానంగా ఏర్పాటు చేసుకునే స్థలాన్ని వెదికి అక్కడికి మీరు యాత్రలు చేస్తూ ఉండాలి.

ద్వితీయోపదేశ కాండము 12:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీ హోమ బలులు, అర్పణ బలులు, మీ దశమభాగాలు, ప్రతిష్టిత నైవేద్యాలు, మొక్కుబడి అర్పణలు, స్వేచ్ఛార్పణలు, పశువులు, మేకల్లో తొలిచూలు పిల్లలు, వీటన్నిటినీ అక్కడికే తీసుకురావాలి.

ద్వితీయోపదేశ కాండము 12:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అక్కడే మీరు, మీ దేవుడు యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి ఇచ్చిన మీ కుటుంబాలు యెహోవా సన్నిధిలో భోజనం చేసి మీ పనులన్నిటిలో సంతోషించాలి.

ద్వితీయోపదేశ కాండము 12:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈ రోజు మనమిక్కడ చేస్తున్నట్టు మీలో ప్రతివాడూ తనకిష్టమైనట్టు చేయకూడదు.

ద్వితీయోపదేశ కాండము 12:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ దేవుడు యెహోవా మీకిస్తున్న విశ్రాంతిని, స్వాస్థ్యాన్ని మీరింతకు ముందు పొందలేదు.

ద్వితీయోపదేశ కాండము 12:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు యొర్దాను దాటి మీ దేవుడు యెహోవా మీకు స్వాస్థ్యంగా ఇస్తున్న దేశంలో స్థిరపడిన తరువాత ఆయన మీ చుట్టూ ఉన్న శత్రువులందరి నుండి మీకు విశ్రాంతినిచ్చి నెమ్మది కలిగిస్తాను.

ద్వితీయోపదేశ కాండము 12:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను మీకు ఆజ్ఞాపించేవాటన్నిటిననీ, అంటే మీ హోమ బలులు, బలులు, దశమ భాగాలు, ప్రతిష్ఠిత నైవేద్యాలు, మీరు యెహోవాకు చేసే శ్రేష్ఠమైన మొక్కుబళ్లను మీ దేవుడైన యెహోవా తన పేరుకు నివాసంగా ఏర్పాటు చేసుకునే స్థలానికే మీరు తీసుకురావాలి.

ద్వితీయోపదేశ కాండము 12:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు, మీ కొడుకులు, కూతుళ్ళు, దాసులు, దాసీలు, మీలో స్వాస్థ్యం లేకుండా మీ ఇళ్ళలో ఉండే లేవీయులు మీ దేవుడు యెహోవా సన్నిధిలో సంతోషించాలి.

ద్వితీయోపదేశ కాండము 12:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు చూసిన ప్రతి స్థలంలో మీ దహనబలులు అర్పించకూడదు.

ద్వితీయోపదేశ కాండము 12:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కేవలం యెహోవా మీ గోత్రాల్లో ఒకదాని మధ్య ఏర్పాటు చేసుకునే స్థలంలోనే మీ హోమబలులు అర్పించి నేను మీకు ఆజ్ఞాపించే సమస్తాన్నీ అక్కడే జరిగించాలి.

ద్వితీయోపదేశ కాండము 12:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే మీ దేవుడు యెహోవా మిమ్మల్ని దీవించిన కొలది మీ ఇళ్ళలో మీకిష్టమైన దాన్ని చంపి తినవచ్చు. పవిత్రులైనా, అపవిత్రులైనా ఎర్రజింకను, చిన్న దుప్పిని తినవచ్చు.

ద్వితీయోపదేశ కాండము 12:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వాటి రక్తం మాత్రం తినకూడదు. దాన్ని నీళ్లలాగా నేల మీద పారబోయాలి.

ద్వితీయోపదేశ కాండము 12:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీ ధాన్యంలో, ద్రాక్షారసంలో, నూనెలో, దశమ భాగం, మీ ఆవులు, గొర్రెలు, మేకల్లో తొలిచూలు పిల్లల్లో, మీరు చేసే మొక్కుబళ్లలో స్వేచ్ఛార్పణలు, ప్రతిష్ఠార్పణలు మీ ఇంట్లో తినకూడదు.

ద్వితీయోపదేశ కాండము 12:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వాటిని మీ దేవుడైన యెహోవా ఏర్పాటు చేసుకునే స్థలం లోనే మీరు, మీ కొడుకులు, కూతుళ్ళు దాసదాసీలు, మీ ఇంట్లో ఉండే లేవీయులు, అందరూ మీ యెహోవా దేవుని సన్నిధిలో తిని, మీరు చేసే ప్రయత్నాలన్నిటిలో సంతోషించాలి.

ద్వితీయోపదేశ కాండము 12:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు మీ దేశంలో జీవించిన కాలమంతటిలో లేవీయులను విడిచిపెట్టకూడదు.

ద్వితీయోపదేశ కాండము 12:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీ దేవుడు యెహోవా తాను మీ కిచ్చిన మాట ప్రకారం మీ సరిహద్దులను విశాలపరచిన తరువాత తప్పకుండా మాంసం తినాలని కోరుకుంటావు. అప్పుడు నీకిష్టమైన మాంసం తినవచ్చు.

ద్వితీయోపదేశ కాండము 12:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ దేవుడు యెహోవా తన సన్నిధిని నిలిపి ఉంచడానికి ఎన్నుకున్న స్థలం మీకు దూరంగా ఉన్నట్లయితే,

ద్వితీయోపదేశ కాండము 12:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా మీకిచ్చిన ఆవుల్లో గాని, గొర్రెలు, మేకల్లో గాని దేనినైనా నేను మీకాజ్ఞాపించినట్టు చంపి నీ ఇంట్లో తినవచ్చు. జింకను, దుప్పిని తిన్నట్టుగానే దాన్ని తినవచ్చు. పవిత్రులు, అపవిత్రులు అనే భేదం లేకుండ ఎవరైనా తినవచ్చు.

ద్వితీయోపదేశ కాండము 12:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే వాటి రక్తాన్ని మాత్రం తినకూడదు, జాగ్రత్త సుమా. ఎందుకంటే రక్తమే ప్రాణం. మాంసంతో ప్రాణాధారమైన దాన్ని తినకూడదు.

ద్వితీయోపదేశ కాండము 12:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు దాన్ని తినకుండా భూమి మీద నీళ్లలాగా పారబోయాలి.

ద్వితీయోపదేశ కాండము 12:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు దాన్ని తినకుండా యెహోవా దృష్టికి ఇష్టమైనదాన్ని చేసినందుకు మీకు, మీ సంతానానికి మేలు కలుగుతుంది.

ద్వితీయోపదేశ కాండము 12:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీకు నియమించిన ప్రతిష్టితార్పణలు, మొక్కుబడులను మాత్రం యెహోవా ఏర్పాటు చేసుకున్న స్థలానికే మీరు తీసుకువెళ్ళాలి.

ద్వితీయోపదేశ కాండము 12:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీ దహనబలులనూ వాటి రక్తమాంసాలనూ మీ దేవుడు యెహోవా బలిపీఠం మీద అర్పించాలి. మీ బలుల రక్తాన్ని మీ దేవుడు యెహోవా బలిపీఠం మీద పోయాలి. వాటి మాంసం మీరు తినాలి.

ద్వితీయోపదేశ కాండము 12:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను మీకు ఆజ్ఞాపిస్తున్న ఈ మాటలన్నిటినీ మీరు జాగ్రత్తగా విని పాటిస్తే మీ దేవుడైన యెహోవా దృష్టికి మంచిదాన్నీ, యుక్తమైనదాన్నీ మీరు చేసినందుకు మీకు, మీ తరువాత మీ సంతతి వారికి ఎల్లప్పుడూ సుఖశాంతులు కలుగుతాయి.

ద్వితీయోపదేశ కాండము 12:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు స్వాధీనం చేసుకోడానికి వెళ్తున్న దేశ ప్రజలను మీ యెహోవా దేవుడు మీ ఎదుట నుండి నాశనం చేసిన తరువాత, మీరు ఆ దేశంలో నివసించేటప్పుడు, మీరు వారిని అనుసరించాలనే శోధనలో చిక్కుకోవద్దు.

ద్వితీయోపదేశ కాండము 12:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈ ప్రజలు తమ దేవుళ్ళను పూజిస్తున్నట్టే మేము కూడా వారి దేవుళ్ళను పూజిస్తాము అనుకోకుండా జాగ్రత్తగా ఉండాలి.

ద్వితీయోపదేశ కాండము 12:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు తమ దేవుళ్ళకు చేసిన విధంగా మీరు మీ దేవుడైన యెహోవా విషయంలో చేయవద్దు. ఎందుకంటే వారు తమ దేవుళ్ళకు చేసేదంతా యెహోవా ద్వేషిస్తాడు. అవి ఆయనకు హేయం. వారు తమ దేవుళ్ళ పేరట తమ కొడుకులనూ, కూతుళ్ళనూ అగ్నిగుండంలో కాల్చివేస్తారు.

ద్వితీయోపదేశ కాండము 12:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను మీకాజ్ఞాపిస్తున్న ప్రతి మాటను మీరు పాటించాలి. దానిలో ఏమీ కలపకూడదు, దానిలో నుండి ఏమీ తీసివేయకూడదు.”

Available Bible Translations

American Standard Version
Deuteronomy 12 (ASV) »
King James Version
Deuteronomy 12 (KJV) »
GOD’S WORD® (GW)
Deuteronomy 12 (GW) »
World English Bible
Deuteronomy 12 (WEB) »
Louis Segond 1910
Deutéronome 12 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
व्यवस्थाविवरण 12 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਅਸਤਸਨਾ 12 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
দ্বিতীয় বিৱৰণ 12 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
உபாகமம் 12 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
अनुवाद 12 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
પુનર્નિયમ 12 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಧರ್ಮೋಪದೇಶಕಾಂಡ 12 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلتَّثْنِيَة 12 (AVD) »
תנ ך עברי מודרני
דברים 12 (HEB) »
Bíblia Sagrada Português
Deuteronômio 12 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Phục Truyền Luật Lệ 12 (VIE) »
Reina Valera Antigua
Deuteronomio 12 (RVA) »
圣 经 简体中文和合本
申 命 记 12 (CUVS) »
聖 經 繁體中文和合本
申 命 記 12 (CUVT) »
Svenska Bibeln 1917
5 Mosebok 12 (SV1917) »
Библия на русском
Второзаконие 12 (RUSV) »
Українська Біблія
Повторення Закону 12 (UKR) »
Szent Biblia - Magyar
5 Mózes 12 (KAR) »
Българска Библия
Второзаконие 12 (BULG) »
聖書 日本語
申命記 12 (JPN) »
Biblia Takatifu
Torati 12 (SWHULB) »
De Heilige Schrift
Deuteronomium 12 (NLD) »

ద్వితీయోపదేశ కాండము (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List