ద్వితీయోపదేశ కాండము Chapter 22 TELIRV Bible Verse Images

ద్వితీయోపదేశ కాండము 22 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share ద్వితీయోపదేశ కాండము 22 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


ద్వితీయోపదేశ కాండము 22:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీ సాటి పౌరుడి ఎద్దు, లేదా గొర్రె దారి తప్పిపోయి తిరగడం మీరు చూస్తే దాన్ని చూడనట్టు కళ్ళు మూసుకోకుండా తప్పకుండా దాని యజమాని దగ్గరికి మళ్లించాలి.

ద్వితీయోపదేశ కాండము 22:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీ సహోదరుడు మీకు అందుబాటులో లేకపోయినా, అతడు మీకు తెలియకపోయినా దాన్ని మీ ఇంటికి తోలుకుపోవాలి. అతడు దాన్ని వెతికే వరకూ అది మీ దగ్గర ఉండాలి. అప్పుడు అతనికి దాన్ని తిరిగి అప్పగించాలి.

ద్వితీయోపదేశ కాండము 22:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతని గాడిద, దుస్తుల విషయంలో కూడా మీరు అలాగే చెయ్యాలి. మీ తోటి ప్రజలు పోగొట్టుకున్నది ఏదైనా మీకు దొరకితే దాన్ని గురించి అలాగే చెయ్యాలి. మీరు దాన్ని చూసీ చూడనట్టు ఉండకూడదు.

ద్వితీయోపదేశ కాండము 22:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీ సాటి మనిషి గాడిద, ఎద్దు దారిలో పడి ఉండడం మీరు చూస్తే వాటిని చూడనట్టు కళ్ళు మూసుకోకూడదు. వాటిని లేపడానికి తప్పకుండా సాయం చెయ్యాలి.

ద్వితీయోపదేశ కాండము 22:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఏ స్త్రీ పురుష వేషం వేసుకోకూడదు. పురుషుడు స్త్రీ వేషం ధరించకూడదు. అలా చేసేవారంతా మీ దేవుడైన యెహోవాకు అసహ్యులు.

ద్వితీయోపదేశ కాండము 22:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
చెట్టు మీదగానీ, నేల మీదగానీ, దారిలోగానీ పక్షిగుడ్లు గానీ పిల్లలు గానీ ఉన్న గూడు మీకు కనబడితే తల్లి ఆ పిల్లల మీద గానీ, ఆ గుడ్ల మీద గానీ పొదుగుతూ ఉన్నప్పుడు ఆ పిల్లలతో పాటు తల్లిపక్షిని తీసుకోకూడదు.

ద్వితీయోపదేశ కాండము 22:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీకు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులయ్యేలా తప్పకుండా తల్లిని విడిచిపెట్టి పిల్లలను తీసుకోవచ్చు.

ద్వితీయోపదేశ కాండము 22:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు కొత్త ఇల్లు కట్టించుకొనేటప్పుడు ఇంటి పైకప్పు చుట్టూ పిట్టగోడ కట్టించాలి. అప్పుడు దాని మీద నుంచి ఎవరైనా పడిపోతే మీ ఇంటి మీద హత్యాదోషం ఉండదు.

ద్వితీయోపదేశ కాండము 22:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీ ద్రాక్షతోటలో రెండు రకాల విత్తనాలను విత్తకూడదు. అలా చేస్తే మీరు వేసిన పంట, ద్రాక్షతోట రాబడి మొత్తం, దేవాలయానికి ప్రతిష్టితమవుతుంది.

ద్వితీయోపదేశ కాండము 22:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎద్దునూ గాడిదనూ జతచేసి భూమిని దున్నకూడదు.

ద్వితీయోపదేశ కాండము 22:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఉన్ని, జనపనారతో కలిపి నేసిన దుస్తులు ధరించకూడదు.

ద్వితీయోపదేశ కాండము 22:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు కప్పుకొనే మీ దుస్తుల నాలుగు అంచులకు అల్లికలు చేసుకోవాలి.

ద్వితీయోపదేశ కాండము 22:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఒకడు స్త్రీని పెళ్లి చేసుకుని ఆమెతో శారీరకంగా ఏకమైన తరువాత ఆమెను అనుమానించి

ద్వితీయోపదేశ కాండము 22:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“ఈ స్త్రీని పెళ్ళి చేసుకుని ఈమె దగ్గరికి వస్తే ఈమెలో నాకు కన్యత్వం కనబడలేదు” అని నేరారోపణ చేసాడనుకోండి.

ద్వితీయోపదేశ కాండము 22:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ స్త్రీ తల్లిదండ్రులు పట్టణ ద్వారం దగ్గర ఉన్న ఆ ఊరి పెద్దల దగ్గరికి ఆ యువతి కన్యాత్వ నిదర్శనం చూపించాలి.

ద్వితీయోపదేశ కాండము 22:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు ఆ స్త్రీ తండ్రి “నా కూతుర్ని ఇతనికిచ్చి పెళ్ళిచేస్తే ఇతడు ‘ఈమెలో కన్యాత్వం కనబడలేదని’ అవమానించి ఆమె మీద నింద మోపాడు.

ద్వితీయోపదేశ కాండము 22:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే నా కూతురు కన్య అని రుజువు పరిచే నిదర్శనం ఇదే” అని పెద్దలతో చెప్పి, పట్టణపు పెద్దల ఎదుట ఆ వస్త్రం పరచాలి.

ద్వితీయోపదేశ కాండము 22:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు ఆ ఊరి పెద్దలు ఆ వ్యక్తిని పట్టుకుని శిక్షించి, 100 వెండి నాణాలు అపరాధ రుసుం అతడి దగ్గర తీసుకుని ఆ స్త్రీ తండ్రికి చెల్లించాలి.

ద్వితీయోపదేశ కాండము 22:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎందుకంటే అతడు ఇశ్రాయేలు కన్యను అవమానపరిచాడు. ఇకపై ఆమె అతనికి భార్యగా ఉంటుంది. అతడు తాను జీవించే కాలమంతా ఆమెను విడిచి పెట్టకూడదు.

ద్వితీయోపదేశ కాండము 22:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే ఆ వ్యక్తి ఆరోపించిన నింద నిజమైనప్పుడు, అంటే ఆ కన్యలో కన్యాత్వం కనబడని పక్షంలో

ద్వితీయోపదేశ కాండము 22:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పెద్దలు ఆమె తండ్రి ఇంటికి ఆమెను తీసుకురావాలి. అప్పుడు ఆమె ఊరి ప్రజలు ఆమెను రాళ్లతో కొట్టి చావగొట్టాలి. ఎందుకంటే ఆమె తన పుట్టింట్లో వ్యభిచరించి ఇశ్రాయేలులో చెడ్డ పని చేసింది. ఆ విధంగా ఆ దుర్మార్గాన్ని మీ మధ్యనుంచి మీరు రూపుమాపుతారు.

ద్వితీయోపదేశ కాండము 22:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎవడైనా మరొకడి భార్యతో శారీరకంగా కలుస్తూ పట్టుబడితే వారిద్దరినీ, అంటే ఆ స్త్రీతో శారీరకంగా కలిసిన పురుషుడినీ, స్త్రీనీ చంపాలి. ఆ విధంగా ఆ దుర్మార్గాన్ని ఇశ్రాయేలులో నుంచి రూపుమాపుతారు.

ద్వితీయోపదేశ కాండము 22:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కన్య అయిన స్త్రీ తనకు ప్రదానం జరిగిన తరువాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకుని ఆమెతో శారీరకంగా కలిస్తే

ద్వితీయోపదేశ కాండము 22:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ ఊరి ద్వారం దగ్గరికి వారిద్దరినీ తీసుకువచ్చి, ఆ స్త్రీ ఊరిలోని ప్రజలను పిలవనందుకు ఆమెనూ, తన పొరుగువాడి భార్యను అవమాన పరచినందుకు ఆ వ్యక్తినీ రాళ్లతో చావగొట్టాలి. ఆ విధంగా ఆ దుర్మార్గాన్ని మీలోనుంచి రూపుమాపాలి.

ద్వితీయోపదేశ కాండము 22:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ప్రదానం జరిగిన కన్యను పొలంలో ఒకడు కలుసుకున్నప్పుడు అతడు ఆమెను బలవంతం చేసి, ఆమెతో శారీరకంగా కలిస్తే, ఆమెతో శారీరకంగా కలిసిన వాడు మాత్రమే చావాలి.

ద్వితీయోపదేశ కాండము 22:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ కన్యను ఏమీ చేయకూడదు, ఎందుకంటే ఆ కన్య మరణానికి గురి అయ్యేంత పాపం చేయలేదు. ఒకడు తన పొరుగు వాడి మీద పడి చంపేసినట్టే ఇది జరిగింది.

ద్వితీయోపదేశ కాండము 22:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు ఆమెను పొలంలో కలుసుకుంటే ప్రదానం జరిగిన ఆ కన్య కేకలు వేసినప్పుడు ఆమెను కాపాడడానికి ఎవరూ లేరు.

ద్వితీయోపదేశ కాండము 22:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఒకడు ప్రదానం జరగని కన్యను పట్టుకుని ఆమెతో శారీరకంగా కలిసిన విషయం తెలిసినప్పుడు

ద్వితీయోపదేశ కాండము 22:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆమెతో శారీరకంగా కలిసినవాడు ఆ కన్య తండ్రికి 50 వెండి నాణాలు చెల్లించి ఆమెను పెళ్లి చేసుకోవాలి. అతడు ఆమెను ఆవమానపరచాడు కాబట్టి అతడు జీవించినంత కాలం ఆమెను విడిచి పెట్టకూడదు.

ద్వితీయోపదేశ కాండము 22:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎవ్వరూ తన తండ్రి భార్యతో అక్రమ సంబంధం పెట్టుకోకూడదు. తన తండ్రికి అప్రతిష్ట కలిగించకూడదు.

Available Bible Translations

American Standard Version (ASV)
Deuteronomy 22 (ASV) »
King James Version (KJV)
Deuteronomy 22 (KJV) »
GOD’S WORD® (GW)
Deuteronomy 22 (GW) »
Berean Bible (BSB)
Deuteronomy 22 (BSB) »
World English Bible (WEB)
Deuteronomy 22 (WEB) »
French Bible (LSG)
Deutéronome 22 (LSG) »
German Bible (LUTH1912)
Deuteronomium 22 (LUTH1912) »
Hebrew Bible (HEB)
דברים 22 (HEB) »
Portuguese Bible (BSL)
Deuteronômio 22 (BSL) »
Spanish Bible (RVA)
Deuteronomio 22 (RVA) »
Italian Bible (RIV)
Deuteronomio 22 (RIV) »
Chinese Simplified (CUVS)
申 命 记 22 (CUVS) »
Chinese Traditional (CUVT)
申 命 記 22 (CUVT) »
Swedish Bible (SV1917)
5 Mosebok 22 (SV1917) »
Hungarian Bible (KAR)
5 Mózes 22 (KAR) »
Japanese Bible (JPN)
申命記 22 (JPN) »
Norwegian Bible (NORSK)
5 Mosebok 22 (NORSK) »

ద్వితీయోపదేశ కాండము (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List