ద్వితీయోపదేశ కాండము Chapter 3 TELIRV Bible Verse Images

ద్వితీయోపదేశ కాండము 3 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share ద్వితీయోపదేశ కాండము 3 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


ద్వితీయోపదేశ కాండము 3:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మనం తిరిగి బాషాను దారిలో వెళ్తుండగా బాషాను రాజు ఓగు, అతని ప్రజలంతా ఎద్రెయీలో మనతో యుద్ధం చేయడానికి ఎదురుగా వచ్చారు.

ద్వితీయోపదేశ కాండము 3:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా నాతో ఇలా అన్నాడు. “అతనికి భయపడ వద్దు. అతన్నీ అతని ప్రజలనూ అతని దేశాన్నీ నీ చేతికి అప్పగించాను. హెష్బోనులో అమోరీయుల రాజు సీహోనుకు చేసినట్టే ఇతనికి కూడా చేయాలి.”

ద్వితీయోపదేశ కాండము 3:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ విధంగా మన దేవుడు యెహోవా బాషాను రాజు ఓగును, అతని ప్రజలందరినీ మన చేతికి అప్పగించాడు. అతనికి ఎవ్వరూ మిగలకుండా అందరినీ హతం చేశాం.

ద్వితీయోపదేశ కాండము 3:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ కాలంలో అతని పట్టణాలన్నీ స్వాధీనం చేసుకున్నాం. మన స్వాధీనంలోకి రాని పట్టణం ఒక్కటీ లేదు. బాషానులో ఓగు రాజ్యం అర్గోబు ప్రాంతంలో ఉన్న 60 పట్టణాలు ఆక్రమించుకున్నాం.

ద్వితీయోపదేశ కాండము 3:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ పట్టణాలన్నీ గొప్ప ప్రాకారాలు, ద్వారాలు, గడియలతో ఉన్న దుర్గాలు. అవిగాక ప్రాకారాలు లేని ఇంకా చాలా పట్టణాలు స్వాధీనం చేసుకున్నాం.

ద్వితీయోపదేశ కాండము 3:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మనం హెష్బోను రాజు సీహోనుకు చేసినట్టు వాటిని నిర్మూలం చేశాం. ప్రతి పట్టణంలోని స్త్రీ పురుషులనూ పిల్లలనూ నాశనం చేశాం.

ద్వితీయోపదేశ కాండము 3:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారి పశువులనూ ఆ పట్టణాల ఆస్తినీ దోచుకున్నాం.

ద్వితీయోపదేశ కాండము 3:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ కాలంలో అర్నోను లోయ నుండి హెర్మోను కొండ వరకూ, యొర్దాను అవతల ఉన్న దేశాన్ని ఇద్దరు అమోరీయుల రాజుల దగ్గర నుండి స్వాధీనం చేసుకున్నాం.

ద్వితీయోపదేశ కాండము 3:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సీదోనీయులు హెర్మోనును “షిర్యోను” అనేవారు. అమోరీయులు దాన్ని “శెనీరు” అనేవారు.

ద్వితీయోపదేశ కాండము 3:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మైదానంలోని పట్టాణాలన్నిటిని, బాషానులోని ఓగు రాజ్య పట్టణాలైన సల్కా, ఎద్రెయీ అనేవాటి వరకూ గిలాదు అంతటినీ బాషానునూ ఆక్రమించాం.

ద్వితీయోపదేశ కాండము 3:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రెఫాయీయులలో బాషాను రాజు ఓగు మాత్రం మిగిలాడు. అతనిది ఇనుప మంచం. అది అమ్మోనీయుల రబ్బాలో ఉంది గదా? దాని పొడవు తొమ్మిది మూరలు, వెడల్పు నాలుగు మూరలు.

ద్వితీయోపదేశ కాండము 3:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అర్నోను లోయలో ఉన్న అరోయేరు పట్టణం నుండి గిలాదు కొండ ప్రాంతంలో సగమూ మనం అప్పుడు స్వాధీనం చేసుకొన్న దేశమూ దాని పట్టణాలూ రూబేనీయులకు, గాదీయులకు ఇచ్చాను.

ద్వితీయోపదేశ కాండము 3:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఓగు రాజుకు చెందిన బాషాను అంతటినీ, గిలాదులో మిగిలిన రెఫాయీయుల దేశమని పిలిచే బాషానునూ, అర్గోబు ప్రాంతమంతా మనష్షే అర్థ గోత్రానికి ఇచ్చాను.

ద్వితీయోపదేశ కాండము 3:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మనష్షే కొడుకు యాయీరు గెషూరీయుల, మాయాకాతీయుల సరిహద్దుల వరకూ అర్గోబు ప్రాంతాన్ని పట్టుకుని, తన పేరును బట్టి వాటికి యాయీరు బాషాను గ్రామాలు అని పేరు పెట్టాడు. ఈ రోజు వరకూ వాటి పేరు అదే.

ద్వితీయోపదేశ కాండము 3:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మాకీరీయులకు గిలాదును ఇచ్చాను.

ద్వితీయోపదేశ కాండము 3:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
గిలాదు నుండి అర్నోను లోయ మధ్య వరకూ, యబ్బోకు నది వరకూ, అమ్మోనీయుల పడమటి సరిహద్దు వరకూ రూబేనీయులకూ గాదీయులకూ ఇచ్చాను.

ద్వితీయోపదేశ కాండము 3:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇవి కాక, కిన్నెరెతు నుండి తూర్పున పిస్గా కొండ వాలుల కింద, ఉప్పు సముద్రం అని పిలిచే అరాబా సముద్రం దాకా వ్యాపించిన అరాబా ప్రాంతాన్ని, యొర్దాను లోయ మధ్యభూమిని, రూబేనీయులకూ గాదీయులకూ ఇచ్చాను.

ద్వితీయోపదేశ కాండము 3:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు నేను మీతో “మీరు స్వాధీనం చేసుకోడానికి మీ దేవుడు యెహోవా ఈ దేశాన్ని మీకిచ్చాడు. మీలో యుద్ధవీరులంతా సిద్ధపడి మీ సోదరులైన ఇశ్రాయేలు ప్రజలతో కలిసి నది దాటి రావాలి.

ద్వితీయోపదేశ కాండము 3:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా మీకు విశ్రాంతినిచ్చినట్టు మీ సోదరులకు కూడా విశ్రాంతినిచ్చే వరకూ నేను మీకిచ్చిన పట్టణాల్లో నివసించాలి.

ద్వితీయోపదేశ కాండము 3:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అంటే మీ యెహోవా దేవుడు యొర్దాను అవతల వారికి ఇస్తున్న దేశాన్ని వారు స్వాధీనం చేసుకునే వరకూ, మీ భార్యలు, మీ పిల్లలు, మీ మందలు నేను మీకిచ్చిన పట్టణాల్లో నివసించాలి. ఆ తరువాత మీరు మీ స్వాస్థ్యాలకు తిరిగి రావాలి అని మీకు ఆజ్ఞాపించాను. మీ మందలు చాలా ఎక్కువని నాకు తెలుసు” అన్నాను.

ద్వితీయోపదేశ కాండము 3:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ సమయంలో నేను యెహోషువకు ఇలా ఆజ్ఞాపించాను. “మీ యెహోవా దేవుడు ఈ ఇద్దరు రాజులకు చేసినదంతా నువ్వు కళ్ళారా చూశావు గదా. నువ్వు వెళ్తున్న రాజ్యాలన్నిటికీ యెహోవా అదే విధంగా చేస్తాడు.

ద్వితీయోపదేశ కాండము 3:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీ యెహోవా దేవుడు మీ పక్షంగా యుద్ధం చేస్తాడు కాబట్టి వారికి భయపడ వద్దు.”

ద్వితీయోపదేశ కాండము 3:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ రోజుల్లో నేను “యెహోవా, ప్రభూ, నీ మహిమనూ, నీ బాహుబలాన్నీ నీ దాసునికి చూపించడం ప్రారంభించావు.

ద్వితీయోపదేశ కాండము 3:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆకాశంలో గాని, భూమిపై గాని నువ్వు చేసే పనులు చేయగల దేవుడెవడు? నీ అంత పరాక్రమం చూపగల దేవుడెవడు?

ద్వితీయోపదేశ కాండము 3:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను అవతలికి వెళ్లి యొర్దాను అవతల ఉన్న ఈ మంచి దేశాన్ని, ఆ మంచి కొండ ప్రాంతాన్ని, ఆ లెబానోనును చూసేలా అనుగ్రహించు” అని యెహోవాను బతిమాలుకున్నాను.

ద్వితీయోపదేశ కాండము 3:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా మీ కారణంగా నా మీద కోపపడి నా మనవి వినలేదు. ఆయన నాతో ఇలా అన్నాడు. “చాలు. ఇంక ఈ సంగతిని గూర్చి నాతో మాట్లాడవద్దు.

ద్వితీయోపదేశ కాండము 3:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నువ్వు ఈ యొర్దాను దాటకూడదు. అయితే, పిస్గా కొండ ఎక్కి పడమటి వైపు, ఉత్తరం వైపు, దక్షిణం వైపు, తూర్పు వైపు తేరి చూడు.

ద్వితీయోపదేశ కాండము 3:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీకు బదులుగా యెహోషువకు ఆజ్ఞాపించి, అతణ్ణి ప్రోత్సహించి, బలపరచు. అతడు ఈ ప్రజలను నడిపించి, నది దాటి, నువ్వు చూడబోయే దేశాన్ని వారు స్వాధీనపరచుకొనేలా చేస్తాడు.”

ద్వితీయోపదేశ కాండము 3:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ సమయంలో మనం బేత్పయోరు ఎదుట ఉన్న లోయలో ఉన్నాం.

Available Bible Translations

American Standard Version
Deuteronomy 3 (ASV) »
King James Version
Deuteronomy 3 (KJV) »
GOD’S WORD® (GW)
Deuteronomy 3 (GW) »
World English Bible
Deuteronomy 3 (WEB) »
Louis Segond 1910
Deutéronome 3 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
व्यवस्थाविवरण 3 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਅਸਤਸਨਾ 3 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
দ্বিতীয় বিৱৰণ 3 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
உபாகமம் 3 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
अनुवाद 3 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
પુનર્નિયમ 3 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಧರ್ಮೋಪದೇಶಕಾಂಡ 3 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلتَّثْنِيَة 3 (AVD) »
תנ ך עברי מודרני
דברים 3 (HEB) »
Bíblia Sagrada Português
Deuteronômio 3 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Phục Truyền Luật Lệ 3 (VIE) »
Reina Valera Antigua
Deuteronomio 3 (RVA) »
圣 经 简体中文和合本
申 命 记 3 (CUVS) »
聖 經 繁體中文和合本
申 命 記 3 (CUVT) »
Svenska Bibeln 1917
5 Mosebok 3 (SV1917) »
Библия на русском
Второзаконие 3 (RUSV) »
Українська Біблія
Повторення Закону 3 (UKR) »
Szent Biblia - Magyar
5 Mózes 3 (KAR) »
Българска Библия
Второзаконие 3 (BULG) »
聖書 日本語
申命記 3 (JPN) »
Biblia Takatifu
Torati 3 (SWHULB) »
De Heilige Schrift
Deuteronomium 3 (NLD) »
Dansk Bibel 1871
5 Mosebog 3 (DA1871) »

ద్వితీయోపదేశ కాండము (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List