ద్వితీయోపదేశ కాండము Chapter 8 TELIRV Bible Verse Images

ద్వితీయోపదేశ కాండము 8 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share ద్వితీయోపదేశ కాండము 8 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


ద్వితీయోపదేశ కాండము 8:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“మీరు జీవించి, ఫలించి యెహోవా మీ పితరులకు వాగ్దానం చేసిన దేశంలో ప్రవేశించి దాన్ని స్వాధీనం చేసుకునేలా ఈ రోజు నేను మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని పాటించాలి.

ద్వితీయోపదేశ కాండము 8:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు ఆయన ఆజ్ఞలను పాటిస్తారో లేదో మిమ్మల్ని పరీక్షించి మీ హృదయాన్ని తెలుసుకోడానికీ, మిమ్మల్ని లోబరచుకోడానికీ మీ యెహోవా దేవుడు అరణ్యంలో ఈ 40 సంవత్సరాలు మిమ్మల్ని నడిపించిన సంగతి జ్ఞాపకం చేసుకోండి.

ద్వితీయోపదేశ కాండము 8:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రొట్టె వలన మాత్రమే కాక యెహోవా పలికిన ప్రతి మాట వలన మనుషులు జీవిస్తారని మీకు తెలిసేలా చేయడానికి ఆయన మిమ్మల్ని అణగదొక్కి, మీకు ఆకలి కలిగించి, మీరు గాని, మీ పూర్వీకులు గాని ఎప్పుడూ చూడని మన్నాతో మిమ్మల్ని పోషించాడు.

ద్వితీయోపదేశ కాండము 8:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈ 40 సంవత్సరాలు మీరు వేసుకున్న బట్టలు పాతబడిపోలేదు, మీ కాళ్ళు బరువెక్కలేదు.

ద్వితీయోపదేశ కాండము 8:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఒక వ్యక్తి తన సొంత కొడుకుని ఏవిధంగా శిక్షిస్తాడో అదే విధంగా మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని శిక్షిస్తాడని మీరు తెలుసుకోవాలి.

ద్వితీయోపదేశ కాండము 8:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన మార్గాల్లో నడుస్తూ ఆయనకు భయపడుతూ మీ యెహోవా దేవుని ఆజ్ఞలను పాటించాలి.

ద్వితీయోపదేశ కాండము 8:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన నిన్ను ప్రవేశపెడుతున్న ఈ మంచి దేశం నీటి వాగులు, లోయలు కొండల నుండి పారే ఊటలు, అగాధ జలాలు గల దేశం.

ద్వితీయోపదేశ కాండము 8:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దానిలో గోదుమలు, బార్లీ, ద్రాక్షచెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు ఉంటాయి. అది ఒలీవ నూనె, తేనె లభించే దేశం.

ద్వితీయోపదేశ కాండము 8:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు తినడానికి ఆహారం పుష్కలంగా లభించే దేశం. అందులో మీకు దేనికీ కొదువ ఉండదు. అది ఇనపరాళ్లు గల దేశం. దాని కొండల్లో మీరు రాగిని తవ్వి తీయవచ్చు.

ద్వితీయోపదేశ కాండము 8:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు తిని తృప్తి పొంది మీ యెహోవా దేవుడు మీకిచ్చిన మంచి దేశాన్నిబట్టి ఆయన్ను స్తుతించాలి.

ద్వితీయోపదేశ కాండము 8:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈ రోజు నేను మీకాజ్ఞాపించే ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నిర్లక్ష్యం చేసి మీ దేవుడైన యెహోవాను మరచిపోకుండా జాగ్రత్త పడండి.

ద్వితీయోపదేశ కాండము 8:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు కడుపారా తిని, మంచి ఇళ్ళు కట్టించుకుని వాటిలో నివసిస్తారు.

ద్వితీయోపదేశ కాండము 8:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీ పశువులు, గొర్రెలు, మేకలు వృద్ధి చెంది, మీ వెండి బంగారాలు విస్తరించి, మీకు కలిగినదంతా వర్ధిల్లుతుంది.

ద్వితీయోపదేశ కాండము 8:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు మీ మనస్సు గర్వించి, బానిసల ఇల్లైన ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు యెహోవాను మరచిపోతారేమో.

ద్వితీయోపదేశ కాండము 8:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బాధ కలిగించే పాములు, తేళ్లతో నిండి, నీళ్ళు లేని ఎడారిలాంటి భయంకరమైన ఆ గొప్ప అరణ్యంలో ఆయన మిమ్మల్ని నడిపించాడు. రాతిబండ నుండి మీకు నీళ్లు రప్పించాడు.

ద్వితీయోపదేశ కాండము 8:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
చివరికి మీకు మేలు చేయాలని ఆయన మిమ్మల్ని అణగదొక్కి, మీకు ఆకలి కలిగించి, మీరు గాని మీ పూర్వీకులు గాని ఎప్పుడూ ఎరగని మన్నాతో మిమ్మల్ని పోషించాడు.

ద్వితీయోపదేశ కాండము 8:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే మీరు, ‘మా సామర్ధ్యం, మా బాహుబలమే మాకింత ఐశ్వర్యం కలిగించాయి’ అనుకుంటారేమో.

ద్వితీయోపదేశ కాండము 8:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి మీరు దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే తాను మీ పూర్వీకులతో వాగ్దానం చేసినట్టు తన నిబంధనను ఈ రోజులాగా స్థాపించాలని మీరు ఐశ్వర్యం సంపాదించుకోడానికి మీకు సామర్ధ్యం కలిగించేవాడు ఆయనే.

ద్వితీయోపదేశ కాండము 8:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు మీ యెహోవా దేవుణ్ణి మరచిపోయి ఇతర దేవుళ్ళను అనుసరించి, వారిని పూజించి నమస్కరిస్తే మీరు తప్పకుండా నశించి పోతారని ఈ రోజు మీ విషయంలో నేను సాక్ష్యం పలుకుతున్నాను.

ద్వితీయోపదేశ కాండము 8:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా మీ ఎదుట ఉండకుండా నాశనం చేస్తున్న ఇతర జాతుల ప్రజలు విననట్టు మీ దేవుడైన యెహోవా మాట వినకపోతే మీరు కూడా వారిలాగానే నాశనమౌతారు.”

Available Bible Translations

American Standard Version
Deuteronomy 8 (ASV) »
King James Version
Deuteronomy 8 (KJV) »
GOD’S WORD® (GW)
Deuteronomy 8 (GW) »
World English Bible
Deuteronomy 8 (WEB) »
Louis Segond 1910
Deutéronome 8 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
व्यवस्थाविवरण 8 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਅਸਤਸਨਾ 8 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
দ্বিতীয় বিৱৰণ 8 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
உபாகமம் 8 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
अनुवाद 8 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
પુનર્નિયમ 8 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಧರ್ಮೋಪದೇಶಕಾಂಡ 8 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلتَّثْنِيَة 8 (AVD) »
תנ ך עברי מודרני
דברים 8 (HEB) »
Bíblia Sagrada Português
Deuteronômio 8 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Phục Truyền Luật Lệ 8 (VIE) »
Reina Valera Antigua
Deuteronomio 8 (RVA) »
圣 经 简体中文和合本
申 命 记 8 (CUVS) »
聖 經 繁體中文和合本
申 命 記 8 (CUVT) »
Svenska Bibeln 1917
5 Mosebok 8 (SV1917) »
Библия на русском
Второзаконие 8 (RUSV) »
Українська Біблія
Повторення Закону 8 (UKR) »
Szent Biblia - Magyar
5 Mózes 8 (KAR) »
Българска Библия
Второзаконие 8 (BULG) »
聖書 日本語
申命記 8 (JPN) »
Biblia Takatifu
Torati 8 (SWHULB) »
De Heilige Schrift
Deuteronomium 8 (NLD) »
Dansk Bibel 1871
5 Mosebog 8 (DA1871) »

ద్వితీయోపదేశ కాండము (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List