ద్వితీయోపదేశ కాండము Chapter 27 TELIRV Bible Verse Images

ద్వితీయోపదేశ కాండము 27 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share ద్వితీయోపదేశ కాండము 27 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


ద్వితీయోపదేశ కాండము 27:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మోషే ఇశ్రాయేలు ప్రజల పెద్దలకు, ప్రజలకు ఇలా ఆజ్ఞాపించారు. “ఈరోజు నేను మీకు ఆజ్ఞాపిస్తున్న ఆజ్ఞలన్నిటినీ పాటించాలి.

ద్వితీయోపదేశ కాండము 27:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీ దేవుడైన యెహోవా మీకు అనుగ్రహిస్తున్న దేశంలో ప్రవేశించడానికి మీరు యొర్దాను నది దాటే రోజు మీరు పెద్ద రాళ్లను నిలబెట్టి వాటి మీద సున్నం పూయాలి.

ద్వితీయోపదేశ కాండము 27:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీ పితరుల దేవుడు యెహోవా మీతో చెప్పిన ప్రకారం మీరు మీ దేవుడైన యెహోవా మీకిస్తున్న పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశించడానికి మీరు నది దాటిన తరువాత ఈ ధర్మశాస్త్ర వాక్యాలన్నీ వాటి మీద రాయాలి.

ద్వితీయోపదేశ కాండము 27:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు ఈ యొర్దాను దాటిన తరువాత నేను ఈ రోజు మీకు ఆజ్ఞాపించినట్టుగా ఈ రాళ్లను ఏబాలు కొండ మీద నిలబెట్టి వాటి మీద సున్నం పూయాలి.

ద్వితీయోపదేశ కాండము 27:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అక్కడ మీ యెహోవా దేవునికి బలిపీఠం కట్టాలి. ఆ బలిపీఠాన్ని రాళ్లతో నిర్మించాలి. ఆ పని కోసం ఇనుప పనిముట్లు ఉపయోగించకూడదు.

ద్వితీయోపదేశ కాండము 27:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
చెక్కకుండా ఉన్న రాళ్లతో మీ యెహోవా దేవునికి బలిపీఠం కట్టి దాని మీద మీ దేవుడైన యెహోవాకు హోమబలులు అర్పించాలి.

ద్వితీయోపదేశ కాండము 27:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు సమాధాన బలులు అర్పించి అక్కడ భోజనం చేసి మీ దేవుడైన యెహోవా ఎదుట సంతోషించాలి.

ద్వితీయోపదేశ కాండము 27:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈ ధర్మశాస్త్ర వాక్యాలన్నీ ఆ రాళ్ల మీద చాలా స్పష్టంగా రాయాలి.

ద్వితీయోపదేశ కాండము 27:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మోషే, యాజకులైన లేవీయులూ ఇశ్రాయేలు ప్రజలందరితో ఇలా చెప్పారు, ఇశ్రాయేలు ప్రజలారా, మీరు మౌనంగా ఉండి మా మాటలు వినండి.

ద్వితీయోపదేశ కాండము 27:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈనాడు మీరు మీ దేవుడైన యెహోవాకు స్వంత ప్రజలయ్యారు. కాబట్టి మీ దేవుడైన యెహోవా మాటలు విని, ఈ రోజు నేను మీకు ఆజ్ఞాపించే ఆయన చట్టాలూ, ఆజ్ఞలూ పాటించాలి.

ద్వితీయోపదేశ కాండము 27:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ రోజే మోషే ప్రజలకు ఇలా ఆజ్ఞాపించాడు, మీరు యొర్దాను దాటిన తరువాత, షిమ్యోను, లేవీ, యూదా, ఇశ్శాఖారు, యోసేపు,

ద్వితీయోపదేశ కాండము 27:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బెన్యామీను గోత్రాలవాళ్ళు ప్రజలకు దీవెన పలుకులు అందించడానికి గెరిజీము కొండ మీద నిలబడాలి.

ద్వితీయోపదేశ కాండము 27:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
రూబేను, గాదు, ఆషేరు, జెబూలూను, దాను, నఫ్తాలి గోత్రాల వాళ్ళు శిక్షలు పలకడానికి ఏబాలు కొండ మీద నిలబడాలి.

ద్వితీయోపదేశ కాండము 27:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు లేవీయులు ఇశ్రాయేలు ప్రజలందరితో బిగ్గరగా ఇలా చెప్పాలి.” “యెహోవాకు అసహ్యం కలిగించే శిల్పి చేతులతో

ద్వితీయోపదేశ కాండము 27:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మలిచిన విగ్రహాన్ని గానీ పోత విగ్రహాన్ని గానీ చేసుకుని దాన్ని రహస్య స్థలంలో నిలబెట్టేవాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు ప్రజలంతా “ఆమేన్‌” అనాలి.

ద్వితీయోపదేశ కాండము 27:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“తన తండ్రినిగానీ, తల్లినిగానీ అవమాన పరచేవాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు, ప్రజలంతా “ఆమేన్‌” అనాలి.

ద్వితీయోపదేశ కాండము 27:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“తన పొరుగువాడి సరిహద్దు రాయిని తొలగించినవాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు, ప్రజలంతా “ఆమేన్‌” అనాలి.

ద్వితీయోపదేశ కాండము 27:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“గుడ్డివాణ్ణి దారి తప్పించేవాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు, ప్రజలంతా “ఆమేన్‌” అనాలి.

ద్వితీయోపదేశ కాండము 27:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“పరదేశికి గానీ, తండ్రి లేనివాడికి గానీ, విధవరాలికి గానీ అన్యాయపు తీర్పు తీర్చేవాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు, ప్రజలంతా “ఆమేన్‌” అనాలి.

ద్వితీయోపదేశ కాండము 27:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“తన తండ్రి భార్యతో లైంగిక సంబంధం పెట్టుకున్నవాడు, తన తండ్రి పడకను హేళన చేసినవాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు, ప్రజలంతా “ఆమేన్‌” అనాలి.

ద్వితీయోపదేశ కాండము 27:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“ఏదైనా జంతువుతో లైంగిక సంబంధం పెట్టుకున్నవాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు, ప్రజలంతా “ఆమేన్‌” అనాలి.

ద్వితీయోపదేశ కాండము 27:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“తన సోదరితో, అంటే తన తండ్రి కూతురుతో గానీ, తన తల్లి కూతురుతో గానీ లైంగిక సంబంధం పెట్టుకున్నవాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు, ప్రజలంతా “ఆమేన్‌” అనాలి.

ద్వితీయోపదేశ కాండము 27:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“తన అత్తతో లైంగిక సంబంధం పెట్టుకున్నవాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు, ప్రజలంతా “ఆమేన్‌” అనాలి.

ద్వితీయోపదేశ కాండము 27:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“రహస్యంగా తన పొరుగువాణ్ణి చంపేవాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు, ప్రజలంతా “ఆమేన్‌” అనాలి.

ద్వితీయోపదేశ కాండము 27:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“నిర్దోషి ప్రాణం తీయడానికి లంచం తీసుకునేవాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు, ప్రజలంతా “ఆమేన్‌” అనాలి.

ద్వితీయోపదేశ కాండము 27:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“ఈ ధర్మశాస్త్రానికి సంబంధించిన విధులను పాటించకుండా వాటిని లక్ష్యపెట్టనివాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు, ప్రజలంతా “ఆమేన్‌” అనాలి.

Available Bible Translations

American Standard Version (ASV)
Deuteronomy 27 (ASV) »
King James Version (KJV)
Deuteronomy 27 (KJV) »
GOD’S WORD® (GW)
Deuteronomy 27 (GW) »
Berean Bible (BSB)
Deuteronomy 27 (BSB) »
World English Bible (WEB)
Deuteronomy 27 (WEB) »
French Bible (LSG)
Deutéronome 27 (LSG) »
German Bible (LUTH1912)
Deuteronomium 27 (LUTH1912) »
Hebrew Bible (HEB)
דברים 27 (HEB) »
Portuguese Bible (BSL)
Deuteronômio 27 (BSL) »
Spanish Bible (RVA)
Deuteronomio 27 (RVA) »
Italian Bible (RIV)
Deuteronomio 27 (RIV) »
Chinese Simplified (CUVS)
申 命 记 27 (CUVS) »
Chinese Traditional (CUVT)
申 命 記 27 (CUVT) »
Swedish Bible (SV1917)
5 Mosebok 27 (SV1917) »
Hungarian Bible (KAR)
5 Mózes 27 (KAR) »
Japanese Bible (JPN)
申命記 27 (JPN) »
Norwegian Bible (NORSK)
5 Mosebok 27 (NORSK) »

ద్వితీయోపదేశ కాండము (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List