ద్వితీయోపదేశ కాండము Chapter 11 TELIRV Bible Verse Images

ద్వితీయోపదేశ కాండము 11 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share ద్వితీయోపదేశ కాండము 11 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


ద్వితీయోపదేశ కాండము 11:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“కాబట్టి మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి, ఆయనను అనుసరిస్తూ ఆయన కట్టడలనూ, విధులనూ, ఆజ్ఞలనూ అన్నివేళలా పాటించాలి.

ద్వితీయోపదేశ కాండము 11:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీ దేవుడు యెహోవా పంపిన శిక్షను గురించీ ఆయన గొప్పతనం, ఆయన బాహుబలం, ఆయన ప్రభావం గురించీ తెలియని మీ పిల్లలతో చెప్పడం లేదని మీరు గ్రహించాలి.

ద్వితీయోపదేశ కాండము 11:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఐగుప్తు రాజైన ఫరోకు, అతని రాజ్యమంతటికి ఆయన చేసిన సూచక క్రియలు, అద్భుత కార్యాలు,

ద్వితీయోపదేశ కాండము 11:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన ఐగుప్తు సైన్యానికి, వారి గుర్రాలకు, రథాలకు జరిగించినది మీరు చూశారు. వారు మిమ్మల్ని తరుముతున్నప్పుడు ఆయన ఎర్రసముద్రపు నీటిని వారి మీదకి ప్రవహించేలా చేసిన విషయం వారికి తెలియదు.

ద్వితీయోపదేశ కాండము 11:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా ఇప్పటి వరకూ వారిని నాశనం చేసినదీ మీరు ఇక్కడికి వచ్చేదాకా ఎడారిలో మీకోసం చేసినదీ వారు చూడలేదు.

ద్వితీయోపదేశ కాండము 11:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అంతేకాదు, యెహోవా రూబేనీయుడైన ఏలీయాబు కొడుకులు దాతాను, అబీరాములకు చేసినదీ భూమి నోరు తెరచి వారిని, వారి ఇళ్ళను, గుడారాలను, వారికి ఉన్న సమస్తాన్నీ ఇశ్రాయేలు ప్రజలందరి మధ్య మింగివేసిన వైనం వారు చూడలేదు, వారికి తెలియదు.

ద్వితీయోపదేశ కాండము 11:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా చేసిన ఆ గొప్ప కార్యాలన్నీ మీ కళ్ళ ఎదుట చేసాడు కదా.

ద్వితీయోపదేశ కాండము 11:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి మీరు బలం తెచ్చుకుని నది దాటి వెళ్తున్న ఆ దేశంలో ప్రవేశించి దాన్ని స్వాధీనం చేసుకోడానికీ,

ద్వితీయోపదేశ కాండము 11:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా మీ పూర్వీకులకు, వారి సంతానానికి ఇస్తానని వాగ్దానం చేసిన దేశంలో, అంటే పాలు తేనెలు ప్రవహించే దేశంలో మీరు దీర్ఘాయుష్షు కలిగి ఉండడానికి నేను ఈ రోజు మీకు ఆజ్ఞాపించే వాటన్నిటిని మీరు పాటించాలి.

ద్వితీయోపదేశ కాండము 11:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు స్వాధీనం చేసుకోబోయే దేశం మీరు విడిచి వచ్చిన ఐగుప్తు లాంటిది కాదు. అక్కడ మీరు విత్తనాలు చల్లి కూరమొక్కలకు చేసినట్టు మీ కాళ్లతో తోటకు నీరు కట్టారు.

ద్వితీయోపదేశ కాండము 11:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు నది దాటి స్వాధీనం చేసుకోడానికి వెళ్తున్న ఈ దేశం కొండలు, లోయలు ఉన్న దేశం.

ద్వితీయోపదేశ కాండము 11:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అది ఆకాశం నుండి కురిసే వర్షం నీరు తాగుతుంది. అది మీ దేవుడు యెహోవా తన దృష్టి ఉంచిన దేశం. ఆయన కనుదృష్టి సంవత్సరం ప్రారంభం నుండి అంతం వరకూ ఎల్లప్పుడూ దానిమీద ఉంటుంది.

ద్వితీయోపదేశ కాండము 11:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి మీ పూర్ణహృదయంతో, మీ పూర్ణాత్మతో, మీ దేవుడైన యెహోవాను ప్రేమించి, ఆయనను సేవించాలి. ఈ రోజు నేను మీకిచ్చే ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా విని పాటిస్తే,

ద్వితీయోపదేశ కాండము 11:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీ దేశానికి వర్షం, అంటే తొలకరి, కడవరి వానలు వాటి కాలంలో కురుస్తాయి. అందువలన మీరు మీ ధాన్యాన్నీ ద్రాక్షారసాన్నీ నూనెనూ పోగు చేసుకుంటారు.

ద్వితీయోపదేశ కాండము 11:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు తిని తృప్తిపొందుతారు. ఆయన మీ పశువుల కోసం మీ పొలాల్లో గడ్డి మొలిపిస్తాడు.

ద్వితీయోపదేశ కాండము 11:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీ హృదయం మోసపోయి, మీరు దారి తప్పి ఇతర దేవుళ్ళను పూజించి, వాటికి మొక్కకుండా జాగ్రత్త వహించండి.

ద్వితీయోపదేశ కాండము 11:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
లేకపోతే యెహోవా మీమీద కోపపడి ఆకాశాన్ని మూసివేస్తాడు. అప్పుడు వాన కురవదు, భూమి పండదు. యెహోవా మీకిస్తున్న ఆ మంచి దేశంలో నివసించకుండా మీరు త్వరగా నాశనమైపోతారు.

ద్వితీయోపదేశ కాండము 11:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయాల్లో, మనస్సుల్లో ఉంచుకోండి. వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకోండి. వాటిని మీ నుదిటి మీద బాసికాలుగా ఉండనివ్వండి.

ద్వితీయోపదేశ కాండము 11:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు మీ ఇంట్లో కూర్చున్నప్పుడు, దారిలో నడిచేటప్పుడు, నిద్రపోయే ముందు, లేచినప్పుడు వాటి గురించి మాట్లాడాలి, వాటిని మీ పిల్లలకు నేర్పించాలి.

ద్వితీయోపదేశ కాండము 11:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీ ఇంటి గుమ్మాల మీద వాటిని రాయాలి.

ద్వితీయోపదేశ కాండము 11:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ విధంగా చేస్తే యెహోవా మీ పూర్వీకులకు ఇస్తానని వాగ్దానం చేసిన దేశంలో మీరు జీవించే కాలం, మీ సంతతివారు జీవించే కాలం భూమిపై ఆకాశం ఉన్నంత కాలం విస్తరిస్తాయి.

ద్వితీయోపదేశ కాండము 11:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు మీ దేవుడు యెహోవాను ప్రేమించి, ఆయన మార్గాల్లో నడుస్తూ, ఆయనకు కట్టుబడి, నేను మీకు ఆదేశించే ఈ ఆజ్ఞలన్నిటినీ జాగ్రత్తగా పాటించాలి.

ద్వితీయోపదేశ కాండము 11:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు యెహోవా మీ ఎదుట నుండి ఈ జాతులన్నిటినీ వెళ్లగొడతాడు. మీరు మీకంటే బలమైన, గొప్ప జాతి ప్రజల దేశాలను స్వాధీనం చేసుకుంటారు.

ద్వితీయోపదేశ కాండము 11:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు అడుగుపెట్టే ప్రతి స్థలం మీదవుతుంది. ఎడారి నుండి లెబానోను వరకూ, యూఫ్రటీసు నది నుండి పడమటి సముద్రం వరకూ మీ సరిహద్దుగా ఉంటుంది.

ద్వితీయోపదేశ కాండము 11:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఏ మానవుడూ మీ ఎదుట నిలవలేడు. ఆయన మీతో చెప్పినట్టు మీ దేవుడు యెహోవా మీరు అడుగుపెట్టే స్థలమంతటి మీదా మీరంటే భయం, వణుకు పుట్టిస్తాడు.

ద్వితీయోపదేశ కాండము 11:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
చూడండి, ఈ రోజు నేను మీ ఎదుట దీవెననూ శాపాన్నీ ఉంచుతున్నాను.

ద్వితీయోపదేశ కాండము 11:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను మీకాజ్ఞాపించే మీ దేవుడు యెహోవా ఆజ్ఞలను మీరు విని, వాటిని పాటిస్తే దీవెన కలుగుతుంది.

ద్వితీయోపదేశ కాండము 11:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు వాటిని విని పాటించకుండా నేను మీకు ఆజ్ఞాపించే మార్గాన్ని విడిచిపెట్టి అప్పటివరకూ మీకు తెలియని ఇతర దేవుళ్ళను అనుసరిస్తే మీకు శాపం కలుగుతుంది.

ద్వితీయోపదేశ కాండము 11:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి మీరు స్వాధీనం చేసుకోబోయే దేశంలో మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని రప్పించిన తరువాత గెరిజీము కొండ మీద ఆ దీవెననూ ఏబాలు కొండ మీద ఆ శాపాన్నీ ప్రకటించాలి.

ద్వితీయోపదేశ కాండము 11:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అవి యొర్దాను అవతల పడమటి వైపు మైదానం మార్గం వెనుక మోరేలోని సింధూరవృక్షాల పక్కన గిల్గాలు ఎదురుగా అరాబాలో నివసించే కనానీయుల దేశంలో ఉన్నాయి కదా.

ద్వితీయోపదేశ కాండము 11:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీ యెహోవా దేవుడు మీకిస్తున్న దేశాన్ని స్వాధీనం చేసుకోడానికి ఈ యొర్దాను నదిని దాటబోతున్నారు. మీరు దాన్ని స్వాధీనం చేసుకుని దానిలో నివసిస్తారు.

ద్వితీయోపదేశ కాండము 11:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈ రోజు నేను మీకు నియమించే కట్టడలు, విధులన్నిటిని మీరు పాటించాలి.”

Available Bible Translations

American Standard Version (ASV)
Deuteronomy 11 (ASV) »
King James Version (KJV)
Deuteronomy 11 (KJV) »
GOD’S WORD® (GW)
Deuteronomy 11 (GW) »
Berean Bible (BSB)
Deuteronomy 11 (BSB) »
World English Bible (WEB)
Deuteronomy 11 (WEB) »
French Bible (LSG)
Deutéronome 11 (LSG) »
German Bible (LUTH1912)
Deuteronomium 11 (LUTH1912) »
Hebrew Bible (HEB)
דברים 11 (HEB) »
Portuguese Bible (BSL)
Deuteronômio 11 (BSL) »
Spanish Bible (RVA)
Deuteronomio 11 (RVA) »
Italian Bible (RIV)
Deuteronomio 11 (RIV) »
Chinese Simplified (CUVS)
申 命 记 11 (CUVS) »
Chinese Traditional (CUVT)
申 命 記 11 (CUVT) »
Swedish Bible (SV1917)
5 Mosebok 11 (SV1917) »
Hungarian Bible (KAR)
5 Mózes 11 (KAR) »
Japanese Bible (JPN)
申命記 11 (JPN) »
Norwegian Bible (NORSK)
5 Mosebok 11 (NORSK) »

ద్వితీయోపదేశ కాండము (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List