ద్వితీయోపదేశ కాండము Chapter 19 TELIRV Bible Verse Images

ద్వితీయోపదేశ కాండము 19 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share ద్వితీయోపదేశ కాండము 19 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


ద్వితీయోపదేశ కాండము 19:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“మీ యెహోవా దేవుడు ఎవరి దేశాన్ని మీకిస్తున్నాడో ఆ ప్రజలను యెహోవా దేవుడు నాశనం చేసిన తరువాత మీరు వారి దేశాన్ని స్వాధీనం చేసుకుని, వారి పట్టణాల్లో వారి ఇళ్ళల్లో నివసించాలి.

ద్వితీయోపదేశ కాండము 19:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు స్వాధీనం చేసుకొనేలా యెహోవా దేవుడు మీకిస్తున్న దేశంలో మూడు పట్టణాలను వేరు పరచాలి.

ద్వితీయోపదేశ కాండము 19:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు స్వాధీనం చేసుకొనేలా యెహోవా దేవుడు మీకిస్తున్న దేశపు సరిహద్దుల్లో హంతకుడు పారిపోయి తల దాచుకోవడానికి మూడు పట్టణాలకు వెళ్ళే దారులను కొలిచి ఏర్పరచాలి.

ద్వితీయోపదేశ కాండము 19:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
హంతకుడు పారిపోయి బతకడానికి నియమించిన పద్ధతి ఏమిటంటే, ఒకడు అంతకు ముందు తన పక్కనున్న వాడి మీద పగ ఏమీ లేకుండా

ద్వితీయోపదేశ కాండము 19:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పొరపాటున వాణ్ణి చంపితే, అంటే ఒకడు చెట్లు నరకడానికి వేరొక వ్యక్తితో అడవికి వెళ్ళి చెట్లు నరకడానికి తన చేతితో గొడ్డలి దెబ్బ వేసినప్పుడు, గొడ్డలి పిడి ఊడి ఆ వ్యక్తికి తగిలి, వాడు చనిపోతే ఆ హంతకుడు ప్రాణం నిలుపుకునేందుకు వీటిలో ఎదో ఒక పట్టణానికి పారిపోవాలి.

ద్వితీయోపదేశ కాండము 19:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
చనిపోయిన వాడి బంధువు కోపంతో హంతకుణ్ణి తరిమి, దారి చాలా దూరం గనక వాణ్ణి పట్టుకుని చంపకుండేలా వాడు ఇలా చెయ్యాలి. అతనికి ఆ వ్యక్తిపై గతంలో ఎలాంటి పగ లేదు కనుక అతడు మరణశిక్షకు పాత్రుడు కాక పోయినా ఇలా జరగవచ్చు.

ద్వితీయోపదేశ కాండము 19:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందుచేత మూడు పట్టణాలను మీ కోసం ఏర్పరచుకోవాలని నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను.

ద్వితీయోపదేశ కాండము 19:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా దేవుడు మీ పూర్వీకులతో ప్రమాణం చేసినట్టు ఆయన మీ సరిహద్దులను విశాలపరచి, మీ పూర్వీకులకు ఇస్తానని చెప్పిన దేశాన్నంతా మీకిచ్చినప్పుడు మీరు యెహోవా దేవుణ్ణి గౌరవించాలి.

ద్వితీయోపదేశ కాండము 19:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈ రోజు నేను మీకు ఆజ్ఞాపించినట్టు ఎప్పుడూ ఆయన మార్గాల్లో నడవడానికి ఈ ఆజ్ఞలన్నీ పాటిస్తూ ఈ మూడు పట్టణాలు కాక మరో మూడు పట్టణాలను ఏర్పాటు చేసుకోవాలి.

ద్వితీయోపదేశ కాండము 19:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎవరినైనా హత్య చేశామన్న నేరారోపణ మీ మీదికి రాకుండా ఉండేందుకు యెహోవా దేవుడు మీకు వారసత్వంగా ఇస్తున్న మీ దేశంలో నిర్దోషిని హత్య చేయకూడదు.

ద్వితీయోపదేశ కాండము 19:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఒకడు తన పొరుగువాడి మీద పగ పట్టి, అతని కోసం కాపు కాసి అతని మీద పడి వాడు చనిపోయేలా కొట్టి

ద్వితీయోపదేశ కాండము 19:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ పట్టణాల్లో ఒక దానిలోకి పారిపోతే, ఆ ఊరిపెద్దలు మనుషులను పంపి అక్కడనుంచి వాణ్ణి రప్పించాలి. హత్య విషయం ప్రతీకారం చేసేవాడి చేతికి అతన్ని అప్పగించి చంపించాలి.

ద్వితీయోపదేశ కాండము 19:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడిపై కనికరం చూపించకూడదు. మీకు మేలు కలిగేలా ఇశ్రాయేలు ప్రజల మధ్యనుంచి నిర్దోషి ప్రాణం విషయంలో దోషాన్ని పరిహరించాలి.

ద్వితీయోపదేశ కాండము 19:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు స్వాధీనం చేసుకొనేలా యెహోవా దేవుడు మీకిస్తున్న దేశంలో మీకు వచ్చే మీ వారసత్వంలో పూర్వీకులు నియమించిన మీ పొరుగువాడి సరిహద్దు రాయిని తొలగించ కూడదు.

ద్వితీయోపదేశ కాండము 19:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఒకడు జరిగించే పాపం, అపరాధం విషయంలో దాన్ని నిర్ధారించడానికి కేవలం ఒక్క వ్యక్తి సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకోకూడదు. ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తుల సాక్ష్యం మీద ప్రతి దానినీ నిర్థారణ చేయాలి.

ద్వితీయోపదేశ కాండము 19:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఒక వ్యక్తిపై అబద్ద నేరం మోపి, అన్యాయ సాక్ష్యం చెబుతున్నట్టు అనిపిస్తే

ద్వితీయోపదేశ కాండము 19:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ వివాదం ఏర్పడిన ఇద్దరూ యెహోవా ఎదుట, అంటే అప్పుడు విధుల్లో ఉన్న యాజకుల ఎదుట, న్యాయాధిపతుల ఎదుట నిలబడాలి.

ద్వితీయోపదేశ కాండము 19:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ న్యాయాధిపతులు బాగా పరీక్షించిన తరువాత వాడి సాక్ష్యం అబద్ధసాక్ష్యమై తన సోదరుని మీద వాడు అబద్ధసాక్ష్యం చెప్పిన సంగతి వెల్లడైతే వాడు తన సోదరునికి చేయాలని కోరినది వాడి పట్ల జరిగించాలి.

ద్వితీయోపదేశ కాండము 19:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ విధంగా మీ మధ్యనుంచి చెడుతనాన్ని తొలగిస్తారు.

ద్వితీయోపదేశ కాండము 19:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇది తెలుసుకున్న మిగిలినవారు భయం వల్ల మీ దేశంలో అలాంటి దుర్మార్గపు పనులు జరిగించరు.

ద్వితీయోపదేశ కాండము 19:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దుష్ట కార్యాలు జరిగించే ఎవరిపైనా కనికరం చూపకూడదు. అలాంటివారి విషయంలో ప్రాణానికి ప్రాణం, కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చెయ్యి, కాలికి కాలు నియమం పాటించాలి.”

Available Bible Translations

American Standard Version (ASV)
Deuteronomy 19 (ASV) »
King James Version (KJV)
Deuteronomy 19 (KJV) »
GOD’S WORD® (GW)
Deuteronomy 19 (GW) »
Berean Bible (BSB)
Deuteronomy 19 (BSB) »
World English Bible (WEB)
Deuteronomy 19 (WEB) »
French Bible (LSG)
Deutéronome 19 (LSG) »
German Bible (LUTH1912)
Deuteronomium 19 (LUTH1912) »
Hebrew Bible (HEB)
דברים 19 (HEB) »
Portuguese Bible (BSL)
Deuteronômio 19 (BSL) »
Spanish Bible (RVA)
Deuteronomio 19 (RVA) »
Italian Bible (RIV)
Deuteronomio 19 (RIV) »
Chinese Simplified (CUVS)
申 命 记 19 (CUVS) »
Chinese Traditional (CUVT)
申 命 記 19 (CUVT) »
Swedish Bible (SV1917)
5 Mosebok 19 (SV1917) »
Hungarian Bible (KAR)
5 Mózes 19 (KAR) »
Japanese Bible (JPN)
申命記 19 (JPN) »
Norwegian Bible (NORSK)
5 Mosebok 19 (NORSK) »

ద్వితీయోపదేశ కాండము (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List