ద్వితీయోపదేశ కాండము Chapter 2 TELIRV Bible Verse Images

ద్వితీయోపదేశ కాండము 2 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share ద్వితీయోపదేశ కాండము 2 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


ద్వితీయోపదేశ కాండము 2:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు యెహోవా నాతో చెప్పిన విధంగా మనం తిరిగి ఎర్రసముద్రం దారిలో ఎడారి గుండా చాలా రోజులు శేయీరు కొండ చుట్టూ తిరిగాం.

ద్వితీయోపదేశ కాండము 2:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా నాకు ఇలా చెప్పాడు. “మీరు ఈ కొండ చుట్టూ తిరిగింది చాలు,

ద్వితీయోపదేశ కాండము 2:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఉత్తరం వైపుకు వెళ్ళండి. నువ్వు ప్రజలతో ఇలా చెప్పు.

ద్వితీయోపదేశ కాండము 2:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
‘శేయీరులో నివసించే ఏశావు సంతానమైన మీ సోదరుల సరిహద్దులు దాటి వెళ్లబోతున్నారు, వారు మీకు భయపడతారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి.

ద్వితీయోపదేశ కాండము 2:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారితో కలహం పెట్టుకోవద్దు. ఎందుకంటే ఏశావుకు శేయీరును స్వాస్థ్యంగా ఇచ్చింది నేనే. వారి భూమిలోనిది ఒక్క అడుగైనా మీకియ్యను.

ద్వితీయోపదేశ కాండము 2:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు డబ్బులిచ్చి వారి దగ్గర ఆహారం కొని తినవచ్చు. డబ్బులిచ్చి నీళ్లు కొని తాగవచ్చు.’

ద్వితీయోపదేశ కాండము 2:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎందుకంటే మీ చేతి పని అంతటినీ మీ యెహోవా దేవుడు ఆశీర్వదించాడు. ఈ గొప్ప ఎడారిలో నువ్వు ఈ నలభై సంవత్సరాలు తిరిగిన సంగతి ఆయనకు తెలుసు. ఆయన మీకు తోడుగా ఉన్నాడు, మీకేమీ తక్కువ కాదు.”

ద్వితీయోపదేశ కాండము 2:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు శేయీరులో నివసించే ఏశావు సంతానమైన మన సోదరులను విడిచి, ఏలతు, ఎసోన్గెబెరు, అరాబా దారిలో మనం ప్రయాణించాం.

ద్వితీయోపదేశ కాండము 2:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మనం తిరిగి మోయాబు ఎడారి మార్గంలో వెళుతుండగా యెహోవా నాతో ఇలా అన్నాడు. “మోయాబీయులను బాధ పెట్టవద్దు. వారితో యుద్ధం చేయొద్దు. లోతు సంతానానికి ఆర్ దేశాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాను. వారి భూమిలో దేనినీ నీ స్వంతానికి ఇవ్వను.”

ద్వితీయోపదేశ కాండము 2:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
గతంలో ఏమీయులు ఆ ప్రాంతాల్లో ఉండేవారు. వారు అనాకీయుల్లాగా పొడవైనవారు, బలవంతులైన గొప్ప ప్రజ. అనాకీయుల్లాగా వారిని కూడా “రెఫాయీయులు” అని పిలిచారు.

ద్వితీయోపదేశ కాండము 2:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మోయాబీయులు వారికి “ఏమీయులు” పేరు పెట్టారు.

ద్వితీయోపదేశ కాండము 2:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పూర్వకాలంలో హోరీయులు శేయీరులో నివసించారు. ఇశ్రాయేలీయులు యెహోవా తమకిచ్చిన స్వాస్థ్యమైన దేశంలో చేసినట్టు ఏశావు సంతానం హోరీయుల దేశాన్ని స్వాధీనం చేసుకుని వారిని చంపి వారి దేశంలో నివసించారు.

ద్వితీయోపదేశ కాండము 2:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“ఇప్పుడు మీరు లేచి జెరెదు వాగు దాటండి” అని యెహోవా ఆజ్ఞాపించగా మనం జెరెదు వాగు దాటాం.

ద్వితీయోపదేశ కాండము 2:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మనం కాదేషు బర్నేయ నుండి బయలుదేరి జెరెదు వాగు దాటే వరకూ మనం ప్రయాణించిన కాలం 38 సంవత్సరాలు. యెహోవా వారితో శపథం చేసినట్టు అప్పటికి ఆ తరంలో యుద్ధం చేయగల మనుషులందరూ గతించిపోయారు.

ద్వితీయోపదేశ కాండము 2:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అంతే కాదు, వారు గతించే వరకూ ఆ తరం వారిని చంపడానికి యెహోవా హస్తం వారికి విరోధంగా ఉంది.

ద్వితీయోపదేశ కాండము 2:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈ విధంగా సైనికులైన వారంతా చనిపోయి గతించిన తరువాత యెహోవా నాకు ఇలా చెప్పాడు,

ద్వితీయోపదేశ కాండము 2:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“ఈ రోజు నువ్వు మోయాబుకు సరిహద్దుగా ఉన్న ఆర్ దేశాన్ని దాటబోతున్నావు.

ద్వితీయోపదేశ కాండము 2:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అమ్మోనీయుల పక్కగా వెళ్ళేటప్పుడు వారిని బాధించవద్దు.

ద్వితీయోపదేశ కాండము 2:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారితో యుద్ధం చేయొద్దు. ఎందుకంటే లోతు సంతానానికి దాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాను. కాబట్టి వారి దేశంలో భూమిని నీకు ఏ మాత్రం ఇవ్వను.”

ద్వితీయోపదేశ కాండము 2:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దాన్ని కూడా రెఫాయీయుల దేశం అని పిలిచారు. పూర్వం రెఫాయీయులు అందులో నివసించారు. అమ్మోనీయులు వారిని “జంజుమీయులు” అనేవారు.

ద్వితీయోపదేశ కాండము 2:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు అనాకీయుల్లాగా పొడవైన వారు, బలవంతులైన గొప్ప ప్రజలు. అయితే యెహోవా అమ్మోనీయుల ఎదుట నుండి వారిని వెళ్లగొట్టడం వలన అమ్మోనీయులు వారి దేశాన్ని స్వాధీనం చేసుకుని అక్కడ నివసించారు.

ద్వితీయోపదేశ కాండము 2:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన శేయీరులో నివసించే ఏశావు సంతానం కోసం వారి ఎదుట నుండి హోరీయులను నశింపజేశాడు కాబట్టి వారు హోరీయుల దేశాన్ని స్వాధీనం చేసుకుని ఈ రోజు వరకూ అక్కడ నివసిస్తున్నారు.

ద్వితీయోపదేశ కాండము 2:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
గాజా వరకూ ఉన్న గ్రామాల్లో నివసించిన ఆవీయులను కఫ్తోరు నుండి వచ్చిన కఫ్తోరీయులు నాశనం చేసి అక్కడ నివసించారు.

ద్వితీయోపదేశ కాండము 2:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“మీరు బయలుదేరి అర్నోను లోయ దాటండి. ఇదిగో అమోరీయుడు, హెష్బోను రాజు అయిన సీహోనునూ అతని దేశాన్నీ మీ చేతికి అప్పగించాను. అతనితో యుద్ధం చేసి దాన్ని ఆక్రమించుకోండి.

ద్వితీయోపదేశ కాండము 2:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈ రోజు ఆకాశం కింద ఉన్న జాతుల ప్రజలందరికీ నువ్వంటే భయం పుట్టించడం మొదలు పెడుతున్నాను. వారు మీ గురించిన సమాచారం విని నీ ఎదుట వణకి, కలవరపడతారు” అని యెహోవా నాతో చెప్పాడు.

ద్వితీయోపదేశ కాండము 2:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు నేను కెదేమోతు ఎడారిలో నుండి హెష్బోను రాజు సీహోను దగ్గరికి దూతలను పంపి

ద్వితీయోపదేశ కాండము 2:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“మమ్మల్ని నీ దేశం గుండా వెళ్ళనివ్వు. కుడి, ఎడమలకు తిరగకుండా దారిలోనే నడిచిపోతాము.

ద్వితీయోపదేశ కాండము 2:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా దగ్గర సొమ్ము తీసుకుని తినడానికి ఆహార పదార్థాలు, తాగడానికి నీరు ఇవ్వు.

ద్వితీయోపదేశ కాండము 2:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
శేయీరులో ఏశావు సంతానమూ ఆర్ లో మోయాబీయులూ నాకు చేసినట్టు, మా దేవుడు యెహోవా మాకిస్తున్న దేశానికి వెళ్ళడానికి యొర్దాను నది దాటేవరకూ కాలి నడకతోనే మమ్మల్ని వెళ్లనివ్వు” అని శాంతికరమైన మాటలు పలికించాను.

ద్వితీయోపదేశ కాండము 2:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే హెష్బోను రాజు సీహోను మనం తన దేశం గుండా వెళ్లడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే ఈ రోజు జరిగినట్టుగా మన చేతికి అతణ్ణి అప్పగించడం కోసం మీ యెహోవా దేవుడు అతని మనస్సును కఠినపరచి అతని హృదయాన్ని బండబారిపోయేలా చేశాడు.

ద్వితీయోపదేశ కాండము 2:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు యెహోవా “చూడు, సీహోనును అతని దేశాన్ని నీకు అప్పగిస్తున్నాను. అతని దేశాన్ని స్వాధీనం చేసుకోవడం మొదలు పెట్టు” అని నాతో చెప్పాడు.

ద్వితీయోపదేశ కాండము 2:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సీహోనూ అతని ప్రజలంతా యాహసులో మనతో యుద్ధం చేయడానికి వచ్చారు.

ద్వితీయోపదేశ కాండము 2:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మన యెహోవా దేవుడు అతణ్ణి మనకప్పగించాడు కాబట్టి మనం అతన్నీ అతని కొడుకులనూ అతని ప్రజలందరినీ చంపివేశాం.

ద్వితీయోపదేశ కాండము 2:34 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడున్న అతని పట్టణాలనూ, వాటిలోని స్త్రీ పురుషులనూ పిల్లలనూ ఏదీ మిగలకుండా నాశనం చేశాం.

ద్వితీయోపదేశ కాండము 2:35 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కేవలం పశువులనూ ఆ పట్టణాల ఆస్తినీ దోచుకున్నాం.

ద్వితీయోపదేశ కాండము 2:36 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అర్నోను ఏటిలోయ ఒడ్డున ఉన్న అరోయేరు, ఆ లోయలో ఉన్న పట్టణం మొదలుపెట్టి గిలాదు వరకూ మనకు లొంగిపోని పట్టణం ఒక్కటి కూడా లేదు. మన దేవుడు అన్నిటినీ మనకి అప్పగించాడు.

ద్వితీయోపదేశ కాండము 2:37 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే అమ్మోనీయుల దేశానికైనా, యబ్బోకు నది లోయలోని ఏ ప్రాంతానికైనా ఆ కొండప్రాంతంలోని పట్టణాలకైనా మన యెహోవా దేవుడు వెళ్ళవద్దని చెప్పిన మరే స్థలానికైనా మీరు వెళ్ళలేదు.

Available Bible Translations

American Standard Version
Deuteronomy 2 (ASV) »
King James Version
Deuteronomy 2 (KJV) »
GOD’S WORD® (GW)
Deuteronomy 2 (GW) »
World English Bible
Deuteronomy 2 (WEB) »
Louis Segond 1910
Deutéronome 2 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
व्यवस्थाविवरण 2 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਅਸਤਸਨਾ 2 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
দ্বিতীয় বিৱৰণ 2 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
உபாகமம் 2 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
अनुवाद 2 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
પુનર્નિયમ 2 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಧರ್ಮೋಪದೇಶಕಾಂಡ 2 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلتَّثْنِيَة 2 (AVD) »
תנ ך עברי מודרני
דברים 2 (HEB) »
Bíblia Sagrada Português
Deuteronômio 2 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Phục Truyền Luật Lệ 2 (VIE) »
Reina Valera Antigua
Deuteronomio 2 (RVA) »
圣 经 简体中文和合本
申 命 记 2 (CUVS) »
聖 經 繁體中文和合本
申 命 記 2 (CUVT) »
Svenska Bibeln 1917
5 Mosebok 2 (SV1917) »
Библия на русском
Второзаконие 2 (RUSV) »
Українська Біблія
Повторення Закону 2 (UKR) »
Szent Biblia - Magyar
5 Mózes 2 (KAR) »
Българска Библия
Второзаконие 2 (BULG) »
聖書 日本語
申命記 2 (JPN) »
Biblia Takatifu
Torati 2 (SWHULB) »
De Heilige Schrift
Deuteronomium 2 (NLD) »
Dansk Bibel 1871
5 Mosebog 2 (DA1871) »

ద్వితీయోపదేశ కాండము (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List