ద్వితీయోపదేశ కాండము Chapter 26 TELIRV Bible Verse Images

ద్వితీయోపదేశ కాండము 26 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share ద్వితీయోపదేశ కాండము 26 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


ద్వితీయోపదేశ కాండము 26:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీ దేవుడైన యెహోవా మీకు వారసత్వంగా అనుగ్రహించే దేశానికి మీరు చేరుకుని దాన్ని స్వాధీనం చేసుకుని దానిలో నివసిస్తున్నప్పుడు

ద్వితీయోపదేశ కాండము 26:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీ దేవుడైన యెహోవా మీకిస్తున్న మీ భూమిలో నుంచి మీరు కూర్చుకొనే పంటలన్నిట్లో మొదట పండిన పంటలో కొంత భాగాన్ని తీసుకుని ఒక గంపలో ఉంచి, మీ దేవుడైన యెహోవా తనకు మందిరంగా ఏర్పరచుకొనే స్థలానికి తీసుకువెళ్ళాలి.

ద్వితీయోపదేశ కాండము 26:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ సమయంలో సేవ జరిగిస్తున్న యాజకుని దగ్గరికి వెళ్లి “యెహోవా మన పితరులకు ఇస్తానని ప్రమాణం చేసిన దేశానికి నేను వచ్చానన్న విషయాన్ని ఈ రోజు మీ దేవుడైన యెహోవా ముందు ఒప్పుకుంటున్నాను” అని అతనితో చెప్పాలి.

ద్వితీయోపదేశ కాండము 26:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యాజకుడు ఆ గంపను నీ చేతిలో నుంచి తీసుకుని మీ దేవుడైన యెహోవా బలిపీఠం ఎదుట ఉంచాలి.

ద్వితీయోపదేశ కాండము 26:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీ దేవుడైన యెహోవా ఎదుట నువ్వు ఇలా చెప్పాలి. “నా పూర్వీకుడు సంచారం చేసే అరామీ దేశస్థుడు. అతడు కొద్దిమందితో ఐగుప్తు వెళ్లి అక్కడ పరదేశిగా ఉండిపోయాడు. అతడు అక్కడికి వెళ్లి అసంఖ్యాకంగా వృద్ధి పొంది గొప్పదైన, బలమైన జనసమూహం అయ్యాడు.

ద్వితీయోపదేశ కాండము 26:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఐగుప్తీయులు మనలను హింసించి, బాధించి మన మీద కఠినమైన దాస్యం మోపారు.

ద్వితీయోపదేశ కాండము 26:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మనం మన పూర్వీకుల దేవుడైన యెహోవాకు మొరపెట్టాం. యెహోవా మన మొర విని, మన బాధ, ప్రయాస, మనకు కలిగిన హింసను చూశాడు.

ద్వితీయోపదేశ కాండము 26:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా తన బలిష్టమైన చేతితో, తన బలప్రదర్శనతో, తీవ్రమైన భయం కలిగించే కార్యాలతో, అద్భుతమైన సూచనలతో ఐగుప్తు నుంచి మనలను బయటకు రప్పించాడు.

ద్వితీయోపదేశ కాండము 26:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈ స్థలానికి మనలను రప్పించి పాలు తేనెలు పారుతూ ఉన్న ఈ దేశాన్ని మనకిచ్చాడు.

ద్వితీయోపదేశ కాండము 26:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి యెహోవా, నువ్వే నాకిచ్చిన భూమి ప్రథమ ఫలాలు నేను తెచ్చి నీ ఎదుట ఉంచాను.” ఇలా చెప్పిదాన్ని మీ దేవుడైన యెహోవా ఎదుట ఉంచి ఆయనను ఆరాధించాలి.

ద్వితీయోపదేశ కాండము 26:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీకూ, నీ ఇంటి వారికీ నీ దేవుడైన యెహోవా అనుగ్రహించిన మేలులన్నిటి గురించి నువ్వూ, లేవీయులూ నీ దేశంలో ఉన్న పరదేశులూ సంతోషించాలి.

ద్వితీయోపదేశ కాండము 26:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పదవ భాగమిచ్చే మూడవ సంవత్సరం నీ రాబడిలో పదవ వంతు చెల్లించి, అది లేవీయులకూ పరదేశులకూ, తండ్రి లేనివారికీ, విధవరాళ్లకూ ఇవ్వాలి. వారు నీ ఊరిలో వాటిని తిని తృప్తి పొందిన తరువాత

ద్వితీయోపదేశ కాండము 26:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నువ్వు మీ యెహోవా దేవుని ఎదుట నువ్వు నాకాజ్ఞాపించిన నీ ఆజ్ఞలన్నిటి ప్రకారం “నా ఇంటి నుంచి ప్రతిష్ట చేసిన వాటిని విభజించి లేవీయులకూ పరదేశులకు తండ్రి లేనివారికీ విధవరాళ్లకూ ఇచ్చాను. నీ ఆజ్ఞల్లో దేనినీ నేను మీరలేదు, దేనినీ మరచిపోలేదు.

ద్వితీయోపదేశ కాండము 26:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా దుఃఖ సమయంలో దానిలో కొంచెమైనా నేను తినలేదు, అపవిత్రంగా ఉన్న సమయంలో దానిలో నుండి దేనినీ తీసివేయలేదు. చనిపోయిన వారి కోసం దానిలో నుండి ఏదీ ఇవ్వలేదు. నా దేవుడైన యెహోవా మాట విని, నువ్వు నా కాజ్ఞాపించినట్టు అంతా జరిగించాను.

ద్వితీయోపదేశ కాండము 26:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నువ్వు నివసించే నీ పరిశుద్ధ స్థలం, పరలోకం నుంచి చూసి, నీ ప్రజలైన ఇశ్రాయేలును దీవించు. పాలు తేనెలు ప్రవహించే దేశం అని నువ్వు మా పితరులతో ప్రమాణం చేసి, మాకిచ్చిన దేశాన్ని దీవించు” అని చెప్పాలి.

ద్వితీయోపదేశ కాండము 26:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈ కట్టుబాట్లకు, ఆజ్ఞలకూ లోబడి ఉండాలని మీ దేవుడైన యెహోవా ఈనాడు మీకు ఆజ్ఞాపిస్తున్నాడు. కాబట్టి మీరు మీ హృదయ పూర్వకంగా మీ పూర్ణ మనసుతో వాటిని అనుసరించి నడుచుకోవాలి.

ద్వితీయోపదేశ కాండము 26:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవాయే మీకు దేవుడుగా ఉన్నాడనీ మీరు ఆయన మార్గాల్లో నడిచి, ఆయన చట్టాలనూ, ఆజ్ఞలనూ, విధులనూ అనుసరిస్తూ ఆయన మాట వింటామనీ ఈనాడు ఆయనకు మాట ఇచ్చారు.

ద్వితీయోపదేశ కాండము 26:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా మీతో చెప్పినట్టు మీరే ఆయనకు సొంత ప్రజలుగా ఉంటూ ఆయన ఆజ్ఞలన్నిటినీ గైకొంటారని

ద్వితీయోపదేశ కాండము 26:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన సృజించిన అన్ని జాతుల ప్రజలందరి కంటే మీకు కీర్తి, ఘనత, పేరు కలిగేలా మిమ్మల్ని హెచ్చిస్తానని యెహోవా ఈనాడు ప్రకటించాడు. ఆయన చెప్పినట్టుగా మీరు మీ యెహోవా దేవునికి పవిత్ర ప్రజగా ఉంటారనీ ప్రకటించాడు.

Available Bible Translations

American Standard Version (ASV)
Deuteronomy 26 (ASV) »
King James Version (KJV)
Deuteronomy 26 (KJV) »
GOD’S WORD® (GW)
Deuteronomy 26 (GW) »
Berean Bible (BSB)
Deuteronomy 26 (BSB) »
World English Bible (WEB)
Deuteronomy 26 (WEB) »
French Bible (LSG)
Deutéronome 26 (LSG) »
German Bible (LUTH1912)
Deuteronomium 26 (LUTH1912) »
Hebrew Bible (HEB)
דברים 26 (HEB) »
Portuguese Bible (BSL)
Deuteronômio 26 (BSL) »
Spanish Bible (RVA)
Deuteronomio 26 (RVA) »
Italian Bible (RIV)
Deuteronomio 26 (RIV) »
Chinese Simplified (CUVS)
申 命 记 26 (CUVS) »
Chinese Traditional (CUVT)
申 命 記 26 (CUVT) »
Swedish Bible (SV1917)
5 Mosebok 26 (SV1917) »
Hungarian Bible (KAR)
5 Mózes 26 (KAR) »
Japanese Bible (JPN)
申命記 26 (JPN) »
Norwegian Bible (NORSK)
5 Mosebok 26 (NORSK) »

ద్వితీయోపదేశ కాండము (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List