ద్వితీయోపదేశ కాండము Chapter 10 TELIRV Bible Verse Images

ద్వితీయోపదేశ కాండము 10 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share ద్వితీయోపదేశ కాండము 10 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


ద్వితీయోపదేశ కాండము 10:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు యెహోవా “నువ్వు మొదటి పలకల వంటివి రెండు రాతిపలకలు చెక్కి, కొండ ఎక్కి నా దగ్గరికి రా. అలాగే చెక్కతో ఒక పెట్టె చేసుకో.

ద్వితీయోపదేశ కాండము 10:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నువ్వు పగలగొట్టిన మొదటి పలకల మీద ఉన్న మాటలను నేను ఈ పలకల మీద రాసిన తరవాత వాటిని నువ్వు ఆ పెట్టెలో ఉంచాలి” అని నాతో చెప్పాడు.

ద్వితీయోపదేశ కాండము 10:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి నేను తుమ్మకర్రతో ఒక పెట్టె చేయించి మొదటి పలకలవంటి రెండు రాతి పలకలను చెక్కి వాటిని పట్టుకుని కొండ ఎక్కాను.

ద్వితీయోపదేశ కాండము 10:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు సమావేశమైన రోజున ఆయన ఆ కొండ మీద అగ్నిలో నుండి మీతో పలికిన పది ఆజ్ఞలనూ మొదట రాసినట్టే ఆ పలకల మీద రాశాడు. యెహోవా వాటిని నాకిచ్చిన తరువాత నేను కొండ దిగి వచ్చి

ద్వితీయోపదేశ కాండము 10:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను చేసిన మందసంలో ఆ పలకలు ఉంచాను. అదుగో, యెహోవా నాకాజ్ఞాపించినట్టు వాటిని దానిలో ఉంచాను.

ద్వితీయోపదేశ కాండము 10:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇశ్రాయేలు ప్రజలు యహకానీయులకు చెందిన బెయేరోతు నుండి బయలుదేరి మోసేరుకు వచ్చినప్పుడు అహరోను చనిపోయాడు. అక్కడ అతణ్ణి సమాధి చేశారు. అతని కొడుకు ఎలియాజరు అతని స్థానంలో యాజకుడయ్యాడు.

ద్వితీయోపదేశ కాండము 10:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అక్కడ నుండి వారు గుద్గోదకు, గుద్గోద నుండి నీటివాగులతో నిండి ఉండే యొత్బాతా ప్రాంతానికి ప్రయాణమయ్యారు.

ద్వితీయోపదేశ కాండము 10:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పటి వరకూ జరుగుతున్నట్టు యెహోవా నిబంధన మందసాన్ని మోయడానికి, యెహోవా సన్నిధిలో నిలబడి సేవించడానికి, ప్రజలను ఆయన పేరిట దీవించడానికి ఆ సమయంలో యెహోవా లేవీ గోత్రం వారిని ఎన్నుకున్నాడు.

ద్వితీయోపదేశ కాండము 10:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అందుకే లేవీయులు తమ సోదరులతో పాటు స్వాస్థ్యం పొందలేదు. మీ దేవుడైన యెహోవా వారితో చెప్పినట్టు వారి స్వాస్థ్యం ఆయనే.

ద్వితీయోపదేశ కాండము 10:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇంతకు ముందులాగా నేను నలభై పగళ్లు, నలభై రాత్రులు కొండ మీద ఉన్నప్పుడు యెహోవా నా మనవి ఆలకించి మిమ్మల్ని నాశనం చేయడం మానుకున్నాడు.

ద్వితీయోపదేశ కాండము 10:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా నాతో “ఈ ప్రజలు నేను వారి పూర్వీకులకు వాగ్దానం చేసిన దేశంలో ప్రవేశించి స్వాధీనం చేసుకొనేలా వారికి ముందుగా నడువు” అని చెప్పాడు.

ద్వితీయోపదేశ కాండము 10:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి ఇశ్రాయేలూ, మీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గాల్లో నడుస్తూ, ఆయన్ని ప్రేమించి, మీ పూర్ణ మనస్సుతో, మీ పూర్ణాత్మతో సేవించు.

ద్వితీయోపదేశ కాండము 10:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీ మేలు కోసం ఈ రోజు నేను మీకు ఆజ్ఞాపించే యెహోవా ఆజ్ఞలను, కట్టడలను పాటించడం తప్ప మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఇంకేమి కోరుతున్నాడు?

ద్వితీయోపదేశ కాండము 10:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
చూడు, ఆకాశ మహాకాశాలు, భూమి, వాటిలో ఉన్నదంతా మీ దేవుడైన యెహోవావే.

ద్వితీయోపదేశ కాండము 10:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే యెహోవా మీ పూర్వీకులను ప్రేమించి వారి విషయంలో సంతోషించి వారి సంతానమైన మిమ్మల్ని మిగిలిన ప్రజలందరిలో ఈ రోజు ఏర్పాటు చేసుకున్నాడు.

ద్వితీయోపదేశ కాండము 10:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి మీరు మూర్ఖంగా ప్రవర్తించకుండా సున్నతి లేని మీ హృదయాలకు సున్నతి చేసుకోండి.

ద్వితీయోపదేశ కాండము 10:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎందుకంటే మీ దేవుడు యెహోవా దేవుళ్లకే దేవుడు, ప్రభువులకే ప్రభువు. ఆయనే మహా దేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన మానవులెవరినీ లక్ష్య పెట్టడు. లంచం పుచ్చుకోడు.

ద్వితీయోపదేశ కాండము 10:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన అనాథలకు, విధవరాళ్ళకు న్యాయం తీరుస్తాడు, పరదేశుల మీద దయ చూపి వారికి అన్నవస్త్రాలు అనుగ్రహిస్తాడు.

ద్వితీయోపదేశ కాండము 10:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు ఐగుప్తు దేశంలో ప్రవాసులుగా ఉన్నవారే కాబట్టి పరదేశి పట్ల జాలి చూపండి.

ద్వితీయోపదేశ కాండము 10:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీ దేవుడైన యెహోవాకు భయపడి, ఆయన్ను సేవించి, ఆయన్నే హత్తుకుని, ఆయన పేరటే ప్రమాణం చేయండి.

ద్వితీయోపదేశ కాండము 10:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయనే మీ స్తుతికి పాత్రుడు. మీరు కళ్ళారా చూస్తుండగా భీకరమైన గొప్ప కార్యాలు మీ కోసం చేసిన మీ దేవుడు ఆయనే.

ద్వితీయోపదేశ కాండము 10:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీ పూర్వీకులు 70 మంది గుంపుగా ఐగుప్తుకు వెళ్ళారు. ఇప్పుడైతే మీ యెహోవా దేవుడు ఆకాశనక్షత్రాల్లాగా మిమ్మల్ని విస్తరింపజేశాడు.

Available Bible Translations

American Standard Version (ASV)
Deuteronomy 10 (ASV) »
King James Version (KJV)
Deuteronomy 10 (KJV) »
GOD’S WORD® (GW)
Deuteronomy 10 (GW) »
Berean Bible (BSB)
Deuteronomy 10 (BSB) »
World English Bible (WEB)
Deuteronomy 10 (WEB) »
French Bible (LSG)
Deutéronome 10 (LSG) »
German Bible (LUTH1912)
Deuteronomium 10 (LUTH1912) »
Hebrew Bible (HEB)
דברים 10 (HEB) »
Portuguese Bible (BSL)
Deuteronômio 10 (BSL) »
Spanish Bible (RVA)
Deuteronomio 10 (RVA) »
Italian Bible (RIV)
Deuteronomio 10 (RIV) »
Chinese Simplified (CUVS)
申 命 记 10 (CUVS) »
Chinese Traditional (CUVT)
申 命 記 10 (CUVT) »
Swedish Bible (SV1917)
5 Mosebok 10 (SV1917) »
Hungarian Bible (KAR)
5 Mózes 10 (KAR) »
Japanese Bible (JPN)
申命記 10 (JPN) »
Norwegian Bible (NORSK)
5 Mosebok 10 (NORSK) »

ద్వితీయోపదేశ కాండము (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List