ద్వితీయోపదేశ కాండము Chapter 7 TELIRV Bible Verse Images

ద్వితీయోపదేశ కాండము 7 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share ద్వితీయోపదేశ కాండము 7 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


ద్వితీయోపదేశ కాండము 7:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“మీ దేవుడైన యెహోవా మీరు స్వాధీనం చేసుకోబోయే దేశంలోకి మిమ్మల్ని రప్పించి అనేక జాతుల ప్రజలను, అంటే సంఖ్యలో గాని, బలంలో గాని మిమ్మల్ని మించిన హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు అనే ఏడు జాతుల ప్రజలను మీ ఎదుట నుండి వెళ్లగొట్టాడు.

ద్వితీయోపదేశ కాండము 7:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తరువాత, మీ యెహోవా దేవుడు యుద్ధంలో వారిపై మీకు విజయం అనుగ్రహించినప్పుడు మీరు వారిని చంపి పూర్తిగా నాశనం చేయాలి. వారితో ఒప్పందాలు చేసుకోకూడదు. వారిపై దయ చూపకూడదు.

ద్వితీయోపదేశ కాండము 7:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు వారితో పెళ్ళి సంబంధాలు కలుపుకోకూడదు. వారి కొడుకులకు మీ కూతుళ్ళను ఇవ్వకూడదు. మీ కొడుకులకు వారి కూతుళ్ళను పుచ్చుకోకూడదు.

ద్వితీయోపదేశ కాండము 7:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎందుకంటే వారు నన్ను కాకుండా ఇతర దేవుళ్ళను పూజించేలా మీ కొడుకులను తిప్పివేస్తారు. దాని కారణంగా యెహోవా కోపం మీమీద రేగి ఆయన మిమ్మల్ని త్వరగా నాశనం చేస్తాడు.

ద్వితీయోపదేశ కాండము 7:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి మీరు చేయవలసింది ఏమిటంటే, వారి బలిపీఠాలు కూలదోసి, వారి విగ్రహాలు పగలగొట్టి, వారి దేవతా స్తంభాలు నరికేసి, వారి ప్రతిమలను అగ్నితో కాల్చివేయాలి.

ద్వితీయోపదేశ కాండము 7:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు మీ యెహోవా దేవునికి ప్రతిష్ఠితమైన ప్రజలు. ఆయన భూమి మీద ఉన్న అన్ని జాతుల కంటే మిమ్మల్ని హెచ్చించి, మిమ్మల్ని తన స్వంత ప్రజగా ఏర్పాటు చేసుకున్నాడు.

ద్వితీయోపదేశ కాండము 7:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అంతేగానీ మీరు ఇతర జాతులకంటే విస్తారమైన ప్రజలని యెహోవా మిమ్మల్ని ప్రేమించి ఏర్పరచుకోలేదు. ఇతర జాతుల ప్రజలకంటే సంఖ్యలో మీరు తక్కువే గదా.

ద్వితీయోపదేశ కాండము 7:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించాడు. ఆయన మీ పూర్వీకులకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చేవాడు కనుక తన బాహుబలంతో మిమ్మల్ని బానిసత్వం నుండీ ఐగుప్తు రాజు ఫరో చేతి నుండి విడిపించాడు.

ద్వితీయోపదేశ కాండము 7:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి మీ దేవుడు యెహోవాయే దేవుడనీ తనను ప్రేమించి, తన ఆజ్ఞలను పాటించే వారికి తన నిబంధనను స్థిరపరచేవాడనీ మీరు తెలుసుకోవాలి. ఆయన వేయి తరాల వరకూ కృప చూపేవాడనీ, నమ్మదగిన దేవుడనీ గ్రహించాలి. తనను ద్వేషించే ప్రతి ఒక్కరినీ నేరుగా నాశనం చేసి వారిని శిక్షించేవాడనీ మీరు తెలుసుకోవాలి.

ద్వితీయోపదేశ కాండము 7:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన తనను ద్వేషించేవారి విషయంలో నేరుగా, త్వరగా దండన విధిస్తాడు.

ద్వితీయోపదేశ కాండము 7:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి ఈ రోజు నేను మీకాజ్ఞాపించే విధులను, కట్టడలను మీరు పాటించాలి.

ద్వితీయోపదేశ కాండము 7:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు ఈ విధులను విని వాటిని పాటిస్తూ జీవిస్తే మీ యెహోవా దేవుడు మీ పూర్వీకులకు వాగ్దానం చేసిన ఒప్పందాన్ని నెరవేర్చి మీ పట్ల కృప చూపిస్తాడు.

ద్వితీయోపదేశ కాండము 7:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన మిమ్మల్ని ప్రేమించి, ఆశీర్వదించి, అభివృద్ధి పరుస్తాడు. మీ పూర్వీకులకు వాగ్దానం చేసిన దేశంలో మీ గర్భఫలాన్ని, భూఫలాన్ని, ధాన్యాన్ని, ద్రాక్షారసాన్ని, నూనెను, పశువులు, గొర్రెలు, మేకల మందలను దీవిస్తాడు.

ద్వితీయోపదేశ కాండము 7:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అన్ని ఇతర జాతుల ప్రజలకంటే మీరు ఎక్కువగా ఆశీర్వాదం పొందుతారు. మీలో మగవారికే గాని, ఆడవారికే గాని సంతాన హీనత ఉండదు, మీ పశువుల్లో కూడా ఉండదు.

ద్వితీయోపదేశ కాండము 7:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా మీలో నుండి వ్యాధులన్నిటినీ తీసివేసి, మీకు తెలిసిన ఐగుప్తులోని కఠినమైన క్షయ వ్యాధులన్నిటినీ మీకు దూరపరచి, మిమ్మల్ని ద్వేషించే వారి మీదికే వాటిని పంపిస్తాడు.

ద్వితీయోపదేశ కాండము 7:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీ దేవుడైన యెహోవా మీకు అప్పగిస్తున్న సమస్త జాతులనూ మీరు బొత్తిగా నాశనం చేయాలి. వారి మీద దయ చూపకూడదు. వారి దేవుళ్ళను పూజింపకూడదు. ఎందుకంటే అది మీకు ఉరి అవుతుంది.

ద్వితీయోపదేశ కాండము 7:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈ ప్రజలు మా కంటే విస్తారంగా ఉన్నారు, మేము వారిని ఎలా వెళ్లగొట్టగలం అని మీరనుకుంటారేమో. వారికి భయపడవద్దు.

ద్వితీయోపదేశ కాండము 7:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీ యెహోవా దేవుడు ఫరోకీ ఐగుప్తు దేశానికి చేసిన దాన్ని, అంటే ఆయన మిమ్మల్ని బయటికి తెచ్చినప్పుడు

ద్వితీయోపదేశ కాండము 7:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీ కళ్ళు చూసిన ఆ గొప్ప బాధలు, సూచక క్రియలు, మహత్కార్యాలు, ఆయన బాహుబలం, ఆయన చూపిన మహా శక్తి, వీటన్నిటినీ బాగా జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రజలకు కూడా మీ యెహోవా దేవుడు అలాగే చేస్తాడు.

ద్వితీయోపదేశ కాండము 7:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మిగిలినవారు, మీ కంటబడకుండా దాక్కున్నవారు నశించేదాకా ఆయన వారి మీదికి పెద్ద కందిరీగలను పంపుతాడు.

ద్వితీయోపదేశ కాండము 7:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి వారిని చూసి భయపడవద్దు. మీ యెహోవా దేవుడు మీ మధ్య ఉన్నాడు, ఆయన భయంకరుడైన మహా దేవుడు.

ద్వితీయోపదేశ కాండము 7:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీ యెహోవా దేవుడు మీ ఎదుట నుండి క్రమక్రమంగా ఈ ప్రజలను తొలగిస్తాడు. అడవి జంతువులు విస్తరించి మీకు ఆటంకంగా ఉండవచ్చు కాబట్టి వారినందరినీ ఒక్కసారే మీరు నాశనం చేయవద్దు. అది మీకు క్షేమకరం కాదు.

ద్వితీయోపదేశ కాండము 7:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే మీ యెహోవా దేవుడు యుద్ధంలో వారిని మీకప్పగించి వారిని నాశనం చేసేవరకూ వారిని కలవరానికి గురిచేస్తాడు.

ద్వితీయోపదేశ కాండము 7:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన వారి రాజులను మీ చేతికి అప్పగిస్తాడు. మీరు ఆకాశం కింద నుండి వారి పేరు తుడిచి వేయాలి. మీరు వారిని నాశనం చేసేవరకూ ఏ మనిషీ మీ ఎదుట నిలవలేడు.

ద్వితీయోపదేశ కాండము 7:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారి దేవతా ప్రతిమలను మీరు అగ్నితో కాల్చివేయాలి. వాటి మీద ఉన్న వెండి బంగారాల మీద ఆశ పెట్టుకోకూడదు. మీరు దాని ఉచ్చులో పడతారేమో. అందుకే వాటిని మీరు తీసుకోకూడదు. ఎందుకంటే అది మీ యెహోవా దేవునికి అసహ్యం.

ద్వితీయోపదేశ కాండము 7:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దానివలే మీరు శాపగ్రస్తులు కాకుండేలా మీరు హేయమైన దాన్ని మీ ఇళ్ళకు తేకూడదు. అది శాపగ్రస్తం కాబట్టి దాని పూర్తిగా తోసిపుచ్చి దాన్ని అసహ్యించుకోవాలి.”

Available Bible Translations

American Standard Version (ASV)
Deuteronomy 7 (ASV) »
King James Version (KJV)
Deuteronomy 7 (KJV) »
GOD’S WORD® (GW)
Deuteronomy 7 (GW) »
Berean Bible (BSB)
Deuteronomy 7 (BSB) »
World English Bible (WEB)
Deuteronomy 7 (WEB) »
French Bible (LSG)
Deutéronome 7 (LSG) »
German Bible (LUTH1912)
Deuteronomium 7 (LUTH1912) »
Punjabi Bible (PANIRV)
ਅਸਤਸਨਾ 7 (PANIRV) »
Marathi Bible (MARIRV)
अनुवाद 7 (MARIRV) »
Hebrew Bible (HEB)
דברים 7 (HEB) »
Portuguese Bible (BSL)
Deuteronômio 7 (BSL) »
Spanish Bible (RVA)
Deuteronomio 7 (RVA) »
Italian Bible (RIV)
Deuteronomio 7 (RIV) »
Chinese Simplified (CUVS)
申 命 记 7 (CUVS) »
Chinese Traditional (CUVT)
申 命 記 7 (CUVT) »
Swedish Bible (SV1917)
5 Mosebok 7 (SV1917) »
Hungarian Bible (KAR)
5 Mózes 7 (KAR) »
Japanese Bible (JPN)
申命記 7 (JPN) »
Norwegian Bible (NORSK)
5 Mosebok 7 (NORSK) »

ద్వితీయోపదేశ కాండము (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List