ద్వితీయోపదేశ కాండము Chapter 30 TELIRV Bible Verse Images

ద్వితీయోపదేశ కాండము 30 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share ద్వితీయోపదేశ కాండము 30 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


ద్వితీయోపదేశ కాండము 30:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“నేను మీకు తెలియపరచిన ఈ విషయాలన్నీ అంటే దీవెనలు, శాపాలు మీ మీదికి వచ్చిన తరువాత మీ దేవుడు మిమ్మల్ని వెళ్లగొట్టించిన

ద్వితీయోపదేశ కాండము 30:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అన్ని రాజ్యాల్లో వాటిని గుర్తుకు తెచ్చుకుంటారు. అప్పుడు మీరూ, మీ పిల్లలూ మీ దేవుడైన యెహోవా వైపు తిరిగితే, ఈవేళ నేను మీకాజ్ఞాపించే వాటి ప్రకారం మీరు హృదయపూర్వకంగా సంపూర్ణ ఆత్మతో ఆయన మాట వింటే

ద్వితీయోపదేశ కాండము 30:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీ దేవుడైన యెహోవా చెరలో ఉన్న మిమ్మల్ని మళ్ళీ రప్పిస్తాడు. ఆయన మిమ్మల్ని కనికరించి, మీ యెహోవా దేవుడు ఏ ప్రజల్లోకి మిమ్మల్ని చెదరగొట్టాడో వారందరిలో నుంచి మిమ్మల్ని సమకూర్చి ఇక్కడికి తీసుకువస్తాడు.

ద్వితీయోపదేశ కాండము 30:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
చెదిరిపోయిన మీలో ఎవరైనా భూమి దిగంతాల్లో ఉన్నప్పటికీ అక్కడ నుంచి మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని సమకూర్చి అక్కడ నుంచి తీసుకు వస్తాడు.

ద్వితీయోపదేశ కాండము 30:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీ పూర్వీకులు స్వాధీనం చేసుకున్న దేశానికి మీ యెహోవా దేవుడు మిమ్మల్ని చేరుస్తాడు. మీరు దాన్ని స్వాధీనం చేసుకుంటారు. ఆయన మీకు మేలు చేసి మీ పూర్వీకుల కంటే మిమ్మల్ని అసంఖ్యాకంగా చేస్తాడు.

ద్వితీయోపదేశ కాండము 30:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు బతకడానికి, హృదయపూర్వకంగా సంపూర్ణ ఆత్మతో మీ యెహోవా దేవుని ప్రేమించేలా మీ యెహోవా దేవుడు మీ హృదయానికీ మీ పిల్లల హృదయానికీ సున్నతి చేస్తాడు.

ద్వితీయోపదేశ కాండము 30:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మిమ్మల్ని హింసించిన మీ శత్రువుల మీదికీ మిమ్మల్ని ద్వేషించినవారి మీదికీ మీ యెహోవా దేవుడు ఆ శాపాలన్నీ రప్పిస్తాడు.

ద్వితీయోపదేశ కాండము 30:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు తిరిగి వచ్చి యెహోవా మాట వింటారు. నేనిప్పుడు మీకాజ్ఞాపించే ఆయన ఆజ్ఞలన్నిటి ప్రకారం ప్రవర్తిస్తారు.

ద్వితీయోపదేశ కాండము 30:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీ యెహోవా దేవుడు, మీరు చేతులతో చేసే పనులన్నిటిలో, మీ గర్భఫలం విషయంలో మీ పశువుల గర్భఫలం విషయంలో మీ భూపంట విషయంలో మీకు అభివృద్ధి కలిగిస్తాడు.

ద్వితీయోపదేశ కాండము 30:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో రాసిన ఆయన ఆజ్ఞలనూ, చట్టాలనూ మీరు పాటిస్తే మీ యెహోవా దేవుని మాట విని, మీ హృదయపూర్వకంగా సంపూర్ణ ఆత్మతో మీ యెహోవా దేవుని వైపు తిరిగితే, యెహోవా మీ పూర్వీకుల గురించి సంతోషించినట్టు మీకు మేలు చేయడానికి మీపట్ల మళ్ళీ సంతోషిస్తాడు.

ద్వితీయోపదేశ కాండము 30:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇవ్వాళ నేను మీకు ఆజ్ఞాపించే ఈ విధులు గ్రహించడం మీకు కష్టం కాదు, వాటిని అందుకోవడం అసాధ్యమూ కాదు.

ద్వితీయోపదేశ కాండము 30:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
‘మనం విని, దాని ప్రకారం చేయడం కోసం పరలోకానికి ఎక్కిపోయి మన దగ్గరికి దాన్ని ఎవరు తెస్తారు?’ అని మీరు భావించడానికి అది ఆకాశంలో ఉండేది కాదు.

ద్వితీయోపదేశ కాండము 30:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
‘మనం విని, దాని ప్రకారం చేయడానికి సముద్రం దాటి మన దగ్గరికి దాన్ని ఎవరు తెస్తారు?’ అని భావించడానికి అది సముద్రం అవతల ఉండేదీ కాదు.

ద్వితీయోపదేశ కాండము 30:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు దాని ప్రకారం చేయడానికి ఆ మాట మీకు చాలా సమీపంగా ఉంది. అది మీ నోటి వెంట, మీ హృదయంలో ఉంది.

ద్వితీయోపదేశ కాండము 30:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
చూడండి, ఈరోజు నేను జీవాన్నీ మేలునూ, చావునూ కీడునూ మీ ఎదుట ఉంచాను.

ద్వితీయోపదేశ కాండము 30:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గాల్లో నడుస్తూ ఆయన ఆజ్ఞలూ చట్టాలూ విధులూ ఆచరించమని నేను మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాను. అలా చేస్తే మీరు స్వాధీనం చేసుకోడానికి ప్రవేశించే దేశంలో మీ యెహోవా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.

ద్వితీయోపదేశ కాండము 30:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అయితే మీ హృదయం వేరొక వైపుకు మళ్ళి, మాటకు లోబడక అన్య దేవుళ్ళకు మొక్కి, పూజిస్తే

ద్వితీయోపదేశ కాండము 30:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు తప్పకుండా నాశనమైపోతారని, స్వాధీనం చేసుకోడానికి యొర్దాను నది దాటిపోతున్న దేశంలో మీరు శాశ్వితకాలం జీవించరనీ తెలియచేస్తున్నాను.

ద్వితీయోపదేశ కాండము 30:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈరోజు జీవాన్నీ చావునూ ఆశీర్వాదాన్నీ శాపాన్నీ నేను మీ ఎదుట ఉంచుతున్నాను. భూమినీ, ఆకాశాన్నీ మీ మీద సాక్షులుగా పిలుస్తున్నాను.

ద్వితీయోపదేశ కాండము 30:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీ పితరులు అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించడానికి యెహోవాయే మీ ప్రాణానికీ మీ దీర్ఘాయుష్షుకూ మూలం. కాబట్టి మీరూ మీ సంతానం జీవిస్తూ మీ జీవానికి మూలమైన మీ యెహోవా దేవుణ్ణి ప్రేమించి ఆయన ఉపదేశం విని ఆయనను హత్తుకుని ఉండేలా జీవాన్ని కోరుకోండి.”

Available Bible Translations

American Standard Version (ASV)
Deuteronomy 30 (ASV) »
King James Version (KJV)
Deuteronomy 30 (KJV) »
GOD’S WORD® (GW)
Deuteronomy 30 (GW) »
Berean Bible (BSB)
Deuteronomy 30 (BSB) »
World English Bible (WEB)
Deuteronomy 30 (WEB) »
French Bible (LSG)
Deutéronome 30 (LSG) »
German Bible (LUTH1912)
Deuteronomium 30 (LUTH1912) »
Hebrew Bible (HEB)
דברים 30 (HEB) »
Portuguese Bible (BSL)
Deuteronômio 30 (BSL) »
Spanish Bible (RVA)
Deuteronomio 30 (RVA) »
Italian Bible (RIV)
Deuteronomio 30 (RIV) »
Chinese Simplified (CUVS)
申 命 记 30 (CUVS) »
Chinese Traditional (CUVT)
申 命 記 30 (CUVT) »
Swedish Bible (SV1917)
5 Mosebok 30 (SV1917) »
Hungarian Bible (KAR)
5 Mózes 30 (KAR) »
Japanese Bible (JPN)
申命記 30 (JPN) »
Norwegian Bible (NORSK)
5 Mosebok 30 (NORSK) »

ద్వితీయోపదేశ కాండము (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List