ద్వితీయోపదేశ కాండము Chapter 17 TELIRV Bible Verse Images

ద్వితీయోపదేశ కాండము 17 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share ద్వితీయోపదేశ కాండము 17 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


ద్వితీయోపదేశ కాండము 17:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“ఎలాంటి మచ్చలు, లోపాలు ఉన్న ఎద్దులు, గొర్రెలు మీ యెహోవా దేవునికి బలిగా అర్పించకూడదు. అది మీ యెహోవా దేవునికి అసహ్యం.

ద్వితీయోపదేశ కాండము 17:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీ యెహోవా దేవుని నిబంధన మీరి ఆయన దృష్టిలో దుర్మార్గం చేస్తూ నేనిచ్చిన ఆజ్ఞకు వ్యతిరేకంగా అన్యదేవుళ్ళకు, అంటే సూర్యునికి గానీ చంద్రునికి గానీ ఆకాశ నక్షత్రాల్లో దేనికైనా నమస్కరించి మొక్కే పురుషుడు, స్త్రీ ఎవరైనా మీ యెహోవా దేవుడు మీకిస్తున్న ఏ గ్రామంలోనైనా మీ మధ్య కనబడినప్పుడు,

ద్వితీయోపదేశ కాండము 17:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ విషయం మీకు తెలిసిన తరువాత మీరు విచారణ జరిగించాలి. అది నిజమైతే, అంటే అలాంటి అసహ్యమైన పని ఇశ్రాయేలీయుల్లో జరగడం నిజమైతే

ద్వితీయోపదేశ కాండము 17:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ చెడ్డ పని చేసిన పురుషుణ్ణి, స్త్రీని మీ ఊరి బయటకు తీసుకువెళ్ళి రాళ్లతో కొట్టి చంపాలి.

ద్వితీయోపదేశ కాండము 17:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అలాంటి వాడికి మరణశిక్ష విధించాలంటే ఇద్దరు ముగ్గురు వ్యక్తుల సాక్ష్యం సరిపోతుంది.

ద్వితీయోపదేశ కాండము 17:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కేవలం ఒక్క వ్యక్తి సాక్ష్యంపై అతణ్ణి చంపకూడదు.

ద్వితీయోపదేశ కాండము 17:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతన్ని చంపడానికి, మొదట సాక్షులు, తరువాత ప్రజలంతా అతని మీద చేతులు వేయాలి. ఆ విధంగా మీ మధ్య నుంచి ఆ చెడుతనాన్ని రూపుమాపాలి.

ద్వితీయోపదేశ కాండము 17:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
హత్యకూ, ప్రమాదవశాత్తూ జరిగిన మరణానికీ మధ్య, ఒకడి హక్కూ మరొకడి హక్కూ మధ్య, దెబ్బ తీయడం మరొక రకంగా నష్టపరచడం మధ్య, మీ గ్రామాల్లో భేదాలు వచ్చి, వీటి తేడా తెలుసుకోవడం మీకు కుదరకపోతే

ద్వితీయోపదేశ కాండము 17:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు లేచి మీ యెహోవా దేవుడు ఏర్పరచుకొనే స్థలానికి వెళ్లి యాజకులైన లేవీయులనూ, విధుల్లో ఉన్న న్యాయాధిపతినీ విచారించాలి. వారు దానికి తగిన తీర్పు మీకు తెలియచేస్తారు.

ద్వితీయోపదేశ కాండము 17:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా ఏర్పరచుకొనే చోటులో వాళ్ళు మీకు తెలియచేసే తీర్పు ప్రకారం మీరు జరిగించి వారు మీకు చెప్పే పరిష్కారం ప్రకారం మీరు చెయ్యాలి.

ద్వితీయోపదేశ కాండము 17:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు మీకు బోధించే చట్టాన్ని పాటించాలి. వారు ఇచ్చిన తీర్పు ప్రకారం జరిగించాలి. వారు మీకు చెప్పే మాట నుంచి కుడికిగాని ఎడమకుగాని తిరగకూడదు.

ద్వితీయోపదేశ కాండము 17:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ ప్రదేశంలో ఎవరైనా అహంకారంతో మీ యెహోవా దేవునికి పరిచర్య చేయడానికి నిలిచే యాజకుని మాటగానీ ఆ న్యాయాధిపతి మాటగానీ వినకపోతే అతన్ని చంపివేయాలి. ఆ విధంగా దుర్మార్గాన్ని ఇశ్రాయేలు ప్రజల్లో నుంచి రూపుమాపాలి.

ద్వితీయోపదేశ కాండము 17:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు ప్రజలంతా విని, భయపడి అహంకారంతో ప్రవర్తించకుండా ఉంటారు.

ద్వితీయోపదేశ కాండము 17:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీ యెహోవా దేవుడు మీకిస్తున్న దేశంలో మీరు ప్రవేశించి దాన్ని స్వాధీనం చేసుకుని అందులో నివసించి, మా చుట్టూ ఉన్న అందరి ప్రజల్లాగా మా మీద రాజును నియమించుకుంటాం అనుకుంటే, మీ యెహోవా దేవుడు ఎన్నుకునే వ్యక్తిని తప్పకుండా మీ మీద రాజుగా నియమించుకోవాలి.

ద్వితీయోపదేశ కాండము 17:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీ సోదరుల్లోనే ఒకణ్ణి మీ మీద రాజుగా నియమించుకోవాలి. మీ సోదరుడుకాని విదేశీయుణ్ణి మీపై రాజుగా నియమించుకోకూడదు.

ద్వితీయోపదేశ కాండము 17:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు గుర్రాలను చాలా ఎక్కువగా సంపాదించుకోకూడదు. గుర్రాలను ఎక్కువగా సంపాదించడానికి ప్రజలను ఐగుప్తుకు తిరిగి వెళ్లనివ్వకూడదు. ఎందుకంటే యెహోవా ఇక మీదట మీరు ఈ దారిలో వెళ్లకూడదని మీతో చెప్పాడు.

ద్వితీయోపదేశ కాండము 17:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తన హృదయం తొలగిపోకుండా అతడు ఎక్కువమంది స్త్రీలను పెళ్లి చేసుకోకూడదు. వెండి బంగారాలను అతడు తన కోసం ఎక్కువగా సంపాదించుకోకూడదు.

ద్వితీయోపదేశ కాండము 17:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు రాజ్యసింహాసనంపై కూర్చున్న తరువాత లేవీయులైన యాజకుల స్వాధీనంలో ఉన్న గ్రంథాన్ని చూసి ఆ ధర్మశాస్త్రానికి ఒక ప్రతిని తనకోసం రాసుకోవాలి.

ద్వితీయోపదేశ కాండము 17:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అది అతని దగ్గర ఉండాలి. అతడు జీవించి ఉన్న కాలమంతా ఆ గ్రంథం చదువుతూ ఉండాలి.

ద్వితీయోపదేశ కాండము 17:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అలా చేస్తున్నప్పుడు దేవుడైన యెహోవా పట్ల భయంతో తన సోదరులపై గర్వించకుండా ఈ ఆజ్ఞల విషయంలో కుడికి గాని ఎడమకు గాని తొలగకుండా ఉంటాడు. అప్పుడు రాజ్యంలో అతడూ అతని కొడుకులూ ఇశ్రాయేలులో ఎక్కువ కాలం జీవిస్తారు.”

Available Bible Translations

American Standard Version
Deuteronomy 17 (ASV) »
King James Version
Deuteronomy 17 (KJV) »
GOD’S WORD® (GW)
Deuteronomy 17 (GW) »
World English Bible
Deuteronomy 17 (WEB) »
Louis Segond 1910
Deutéronome 17 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
व्यवस्थाविवरण 17 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਅਸਤਸਨਾ 17 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
দ্বিতীয় বিৱৰণ 17 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
உபாகமம் 17 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
अनुवाद 17 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
પુનર્નિયમ 17 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಧರ್ಮೋಪದೇಶಕಾಂಡ 17 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلتَّثْنِيَة 17 (AVD) »
תנ ך עברי מודרני
דברים 17 (HEB) »
Bíblia Sagrada Português
Deuteronômio 17 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Phục Truyền Luật Lệ 17 (VIE) »
Reina Valera Antigua
Deuteronomio 17 (RVA) »
圣 经 简体中文和合本
申 命 记 17 (CUVS) »
聖 經 繁體中文和合本
申 命 記 17 (CUVT) »
Svenska Bibeln 1917
5 Mosebok 17 (SV1917) »
Библия на русском
Второзаконие 17 (RUSV) »
Українська Біблія
Повторення Закону 17 (UKR) »
Szent Biblia - Magyar
5 Mózes 17 (KAR) »
Българска Библия
Второзаконие 17 (BULG) »
聖書 日本語
申命記 17 (JPN) »
Biblia Takatifu
Torati 17 (SWHULB) »
De Heilige Schrift
Deuteronomium 17 (NLD) »

ద్వితీయోపదేశ కాండము (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List