ద్వితీయోపదేశ కాండము Chapter 21 TELIRV Bible Verse Images

ద్వితీయోపదేశ కాండము 21 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share ద్వితీయోపదేశ కాండము 21 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


ద్వితీయోపదేశ కాండము 21:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“మీ యెహోవా దేవుడు మీకిస్తున్న దేశంలోని పొలంలో ఒకడు చచ్చి పడి ఉండడం మీరు చూస్తే, వాణ్ణి చంపిన వాడెవడో తెలియనప్పుడు

ద్వితీయోపదేశ కాండము 21:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీ పెద్దలూ, న్యాయాధిపతులూ వచ్చి, చనిపోయిన వ్యక్తి చుట్టూ ఉన్న గ్రామాల దూరం కొలిపించాలి.

ద్వితీయోపదేశ కాండము 21:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ శవానికి ఏ ఊరు దగ్గరగా ఉందో ఆ ఊరి పెద్దలు ఏ పనికీ ఉపయోగించని, మెడపై కాడి పెట్టని పెయ్యను తీసుకోవాలి.

ద్వితీయోపదేశ కాండము 21:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దున్నని, సేద్యం చేయని ఏటి లోయ లోకి ఆ పెయ్యను తోలుకుపోయి అక్కడ, అంటే ఆ లోయలో ఆ పెయ్య మెడ విరగదీయాలి.

ద్వితీయోపదేశ కాండము 21:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తరువాత యాజకులైన లేవీయులు దగ్గరికి రావాలి. యెహోవాను సేవించి యెహోవా పేరుతో దీవించడానికి ఆయన వారిని ఏర్పరచుకున్నాడు. కనుక వారి నోటి మాటతో ప్రతి వివాదాన్ని, దెబ్బ విషయమైన ప్రతి వ్యాజ్యాన్ని పరిష్కరించాలి.

ద్వితీయోపదేశ కాండము 21:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు ఆ శవానికి దగ్గరగా ఉన్న ఆ ఊరి పెద్దలంతా ఆ ఏటి లోయలో మెడ విరగదీసిన ఆ పెయ్య మీద తమ చేతులు కడుక్కుని

ద్వితీయోపదేశ కాండము 21:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మా చేతులు ఈ రక్తాన్ని చిందించలేదు, మా కళ్ళు దీన్ని చూడలేదు.

ద్వితీయోపదేశ కాండము 21:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా, నువ్వు విమోచించిన నీ జనమైన ఇశ్రాయేలు ప్రజలను క్షమించు. నీ ప్రజలు ఇశ్రాయేలు ప్రజల మీద నిర్దోషి ప్రాణం తీసిన దోషాన్ని మోపవద్దు అని చెప్పాలి. అప్పుడు ప్రాణం తీసిన దోషానికి వారికి క్షమాపణ కలుగుతుంది.

ద్వితీయోపదేశ కాండము 21:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ విధంగా మీరు యెహోవా దృష్టికి యథార్థమైనది చేసేటప్పుడు మీ మధ్యనుంచి నిర్దోషి ప్రాణం కోసమైన దోషాన్ని తీసివేస్తారు.

ద్వితీయోపదేశ కాండము 21:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు మీ శత్రువులతో యుద్ధం చేయబోయేటప్పుడు మీ యెహోవా దేవుడు మీ చేతికి వారిని అప్పగించిన తరువాత

ద్వితీయోపదేశ కాండము 21:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారిని చెరపట్టి ఆ బందీల్లో ఒక అందమైన అమ్మాయిని చూసి ఆమెను మోహించి, ఆమెను పెళ్లి చేసుకోడానికి ఇష్టపడి,

ద్వితీయోపదేశ కాండము 21:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ ఇంట్లోకి ఆమెను చేర్చుకున్న తరువాత ఆమె తల క్షౌరం చేయించుకుని గోళ్ళు తీయించుకోవాలి.

ద్వితీయోపదేశ కాండము 21:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆమె తన ఖైదీ బట్టలు తీసేసి మీ ఇంట్లో ఉండే నెలరోజులు తన తల్లిదండ్రులను గురించి ప్రలాపించడానికి ఆమెను అనుమతించాలి. తరువాత నువ్వు ఆమెను పెళ్లిచేసుకోవచ్చు. ఆమె నీకు భార్య అవుతుంది.

ద్వితీయోపదేశ కాండము 21:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నువ్వు ఆమె వలన సుఖం పొందలేకపోతే ఆమెకు ఇష్టమున్న చోటికి ఆమెను పంపివేయాలే గాని ఆమెను వెండికి ఎంతమాత్రమూ అమ్మివేయకూడదు. మీరు ఆమెను అవమాన పరిచారు కాబట్టి ఆమెను బానిసగా చూడకూడదు.

ద్వితీయోపదేశ కాండము 21:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఒక వ్యక్తికి ఇద్దరు భార్యలున్నప్పుడు అతడు ఒకరిని ఇష్టపడి, మరొకరిని ఇష్టపడకపోవచ్చు. ఇద్దరికీ పిల్లలు పుడితే,

ద్వితీయోపదేశ కాండము 21:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
పెద్ద కొడుకు ఇష్టం లేని భార్యకు పుట్టిన వాడైతే తండ్రి తనకున్న ఆస్తిని తన కొడుకులకు వారసత్వంగా ఇచ్చే రోజున ఇష్టం లేని భార్యకు పుట్టిన పెద్ద కొడుక్కి బదులు ఇష్టమైన భార్యకు పుట్టినవాణ్ణి పెద్ద కొడుకుగా పరిగణించకూడదు.

ద్వితీయోపదేశ కాండము 21:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇష్టం లేని భార్యకు పుట్టిన వాడికి తండ్రి తన ఆస్తి అంతట్లో రెట్టింపు భాగమిచ్చి అతణ్ణి పెద్ద కొడుకుగా ఎంచాలి. ఇతడు అతని బలారంభం కాబట్టి జ్యేష్ఠత్వ అధికారం అతనిదే.

ద్వితీయోపదేశ కాండము 21:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఒక వ్యక్తి కొడుకు మొండివాడై తిరగబడి తండ్రి మాట, తల్లి మాట వినక, వారు అతణ్ణి శిక్షించిన తరువాత కూడా అతడు వారికి విధేయుడు కాకపోతే

ద్వితీయోపదేశ కాండము 21:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతని తలిదండ్రులు అతని పట్టుకుని ఊరి గుమ్మం దగ్గర కూర్చునే పెద్దల దగ్గరికి అతణ్ణి తీసుకురావాలి.

ద్వితీయోపదేశ కాండము 21:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మా కొడుకు మొండివాడై తిరగబడ్డాడు. మా మాట వినక తిండిబోతూ తాగుబోతూ అయ్యాడు, అని ఊరి పెద్దలతో చెప్పాలి.

ద్వితీయోపదేశ కాండము 21:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు ఊరి ప్రజలంతా రాళ్లతో అతన్ని చావగొట్టాలి. ఆ విధంగా చెడుతనాన్ని మీ మధ్యనుంచి తొలగించిన వాడివౌతావు. ఇశ్రాయేలు ప్రజలందరూ ఈ సంగతి విని భయపడతారు.

ద్వితీయోపదేశ కాండము 21:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మరణశిక్ష పొందేటంత పాపం ఎవరైనా చేస్తే అతణ్ణి చంపి మాను మీద వేలాడదీయాలి.

ద్వితీయోపదేశ కాండము 21:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతని శవం రాత్రి వేళ ఆ మాను మీద ఉండనియ్యకూడదు. వేలాడదీసినవాడు దేవుని దృష్టిలో శాపగ్రస్తుడు కనుక మీ దేవుడైన యెహోవా వారసత్వంగా మీకిస్తున్న దేశం అపవిత్రం కాకుండా ఉండేలా అదే రోజు ఆ శవాన్ని తప్పకుండా పాతిపెట్టాలి.”

Available Bible Translations

American Standard Version
Deuteronomy 21 (ASV) »
King James Version
Deuteronomy 21 (KJV) »
GOD’S WORD® (GW)
Deuteronomy 21 (GW) »
World English Bible
Deuteronomy 21 (WEB) »
Louis Segond 1910
Deutéronome 21 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
व्यवस्थाविवरण 21 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਅਸਤਸਨਾ 21 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
দ্বিতীয় বিৱৰণ 21 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
உபாகமம் 21 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
अनुवाद 21 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
પુનર્નિયમ 21 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಧರ್ಮೋಪದೇಶಕಾಂಡ 21 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلتَّثْنِيَة 21 (AVD) »
תנ ך עברי מודרני
דברים 21 (HEB) »
Bíblia Sagrada Português
Deuteronômio 21 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Phục Truyền Luật Lệ 21 (VIE) »
Reina Valera Antigua
Deuteronomio 21 (RVA) »
圣 经 简体中文和合本
申 命 记 21 (CUVS) »
聖 經 繁體中文和合本
申 命 記 21 (CUVT) »
Svenska Bibeln 1917
5 Mosebok 21 (SV1917) »
Библия на русском
Второзаконие 21 (RUSV) »
Українська Біблія
Повторення Закону 21 (UKR) »
Szent Biblia - Magyar
5 Mózes 21 (KAR) »
Българска Библия
Второзаконие 21 (BULG) »
聖書 日本語
申命記 21 (JPN) »
Biblia Takatifu
Torati 21 (SWHULB) »
De Heilige Schrift
Deuteronomium 21 (NLD) »

ద్వితీయోపదేశ కాండము (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List