ద్వితీయోపదేశ కాండము Chapter 32 TELIRV Bible Verse Images

ద్వితీయోపదేశ కాండము 32 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share ద్వితీయోపదేశ కాండము 32 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


ద్వితీయోపదేశ కాండము 32:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆకాశమా! నేను చెప్పేది విను! నన్ను మాట్లాడనియ్యి. భూగోళమా, నా నోటి మాటలు ఆలకించు.

ద్వితీయోపదేశ కాండము 32:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా ఉపదేశం వానలా కురుస్తుంది. నా మాటలు మంచు బిందువుల్లా, లేతగడ్డిపై పడే చినుకుల్లా, పచ్చికపై కురిసే చిరుజల్లులా, మొక్కలపై కురిసే జల్లులా ఉంటాయి.

ద్వితీయోపదేశ కాండము 32:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను యెహోవా పేరును ప్రకటిస్తాను. మన దేవునికి ఘనత ఆపాదించండి.

ద్వితీయోపదేశ కాండము 32:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన మనకు ఆశ్రయ దుర్గం. ఆయన పని పరిపూర్ణం. ఆయన మార్గాలన్నీ న్యాయమైనవి. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన పక్షపాతం చూపని దేవుడు. ఆయన న్యాయవంతుడు, యథార్థవంతుడు.

ద్వితీయోపదేశ కాండము 32:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు తమను తాము చెడగొట్టుకున్నారు. వారు ఆయన సంతానం కారు. వారు దోషులు, మూర్ఖులైన వక్రతరం.

ద్వితీయోపదేశ కాండము 32:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బుద్ధి, ఇంగితం లేని మనుషులారా, యెహోవాకు ఇదా మీరిచ్చే కానుక? ఆయన మీ తండ్రి కాడా? ఆయనే గదా మిమ్మల్ని పుట్టించి స్థిరపరచింది?

ద్వితీయోపదేశ కాండము 32:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
గతించిన కాలాన్ని గుర్తుకు తెచ్చుకోండి. తరతరాల సంవత్సరాల సంగతులను తలపోయండి. మీ తండ్రిని అడుగు, అతడు నీకు చూపిస్తాడు. పెద్దలను అడుగు, వాళ్ళు నీకు చెబుతారు.

ద్వితీయోపదేశ కాండము 32:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మహోన్నతుడు ప్రజలకు వారి వారి వారసత్వాలను పంచి ఇచ్చినప్పుడు, మానవ జాతులను వేరు పరచినపుడు, ఇశ్రాయేలు ప్రజల లెక్క ప్రకారం ప్రజలకు హద్దులు నియమించాడు.

ద్వితీయోపదేశ కాండము 32:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా వంతు ఆయన ప్రజలే. ఆయన వారసత్వం యాకోబు సంతానమే.

ద్వితీయోపదేశ కాండము 32:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన ఆ ప్రజను ఎడారి ప్రదేశంలో కనుగొన్నాడు. బీడు భూమిలో, భీకరమైన శబ్దాలు ఉన్న నిర్జన ప్రదేశంలో అతణ్ణి రక్షించి ఆదుకున్నాడు. తన కనుపాపలా అతణ్ణి కాపాడాడు.

ద్వితీయోపదేశ కాండము 32:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
గద్ద తన గూడు రేపి తన పిల్లలపై ఎగురుతూ రెక్కలు చాపుకుని ఆ పిల్లలను రెక్కల మీద మోసినట్టు యెహోవా చేశాడు.

ద్వితీయోపదేశ కాండము 32:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా ఒక్కడే ఆ ప్రజలకు దారి చూపుతున్నాడు. వేరే దేవుళ్ళెవరూ ఆయనకు సాటిరారు.

ద్వితీయోపదేశ కాండము 32:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
లోకంలో ఉన్నత స్థలాలపై ఆ ప్రజలను ఎక్కించాడు. పొలాల పంటలు వారికి తినిపించాడు. కొండబండల తేనెతో, చెకుముకి రాతిబండ నూనెతో వారిని తృప్తిపరిచాడు.

ద్వితీయోపదేశ కాండము 32:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆవు మజ్జిగను, గొర్రెల, మేకల పాలనూ, గొర్రెపిల్లల కొవ్వునూ, బాషాను పొట్టేళ్లను, మేకపోతులనూ, శ్రేష్ఠమైన గోదుమ పిండినీ మీకిచ్చాడు. మంచి ద్రాక్షరసంతో చేసిన మద్యం మీరు తాగారు.

ద్వితీయోపదేశ కాండము 32:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెషూరూను కొవ్వి కాలు దువ్వాడు, మీరు కొవ్వుతో బలిసి మొద్దులాగా అయ్యారు. యెషూరూను తనను పుట్టించిన దేవుణ్ణి వదిలేశాడు. తన రక్షణ శిలను నిరాకరించాడు.

ద్వితీయోపదేశ కాండము 32:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు ఇతర దేవుళ్ళను అనుసరించి ఆయనకు రోషం పుట్టించారు. అసహ్యమైన విగ్రహాలు పెట్టుకుని ఆయనకు కోపం తెప్పించారు.

ద్వితీయోపదేశ కాండము 32:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు దేవత్వం లేని దయ్యాలకు బలులు అర్పించారు. తమకు తెలియని దేవుళ్ళకూ, కొత్తగా పుట్టుకొచ్చిన దేవుళ్ళకూ, మీ పితరులు భయపడని దేవుళ్ళకూ బలులర్పించారు.

ద్వితీయోపదేశ కాండము 32:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీకు తండ్రి లాంటి బండను వదిలేశావు, నిన్ను కన్న దేవుణ్ణి మరిచావు.

ద్వితీయోపదేశ కాండము 32:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా దీన్ని చూసి వాళ్ళని వదిలేశాడు, తన కొడుకులూ కూతుర్లూ ఆయన్నలా రేపారు.

ద్వితీయోపదేశ కాండము 32:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయనిలా అన్నాడు. “వారికి నా ముఖాన్ని దాచు కుంటాను. వాళ్ళ అంతం ఎలా ఉంటుందో చూస్తాను. వాళ్ళు మొండి తరం, విశ్వసనీయత లేని పిల్లలు.

ద్వితీయోపదేశ కాండము 32:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దేవుడు కాని దానితో వాళ్ళు నాకు రోషం తెప్పించారు. తమ పనికిమాలిన విగ్రహాలతో నాకు కోపం తెప్పించారు. ప్రజలు కాని వారిని చూసి వారు అసూయ పడేలా చేస్తాను. తెలివిలేని రాజ్యాన్ని చూసి వారికి కోపం వచ్చేలా చేస్తాను.

ద్వితీయోపదేశ కాండము 32:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా కోపాగ్ని రగులుకుంది. పాతాళ అగాధం వరకూ అది మండుతుంది. భూమినీ దాని పంటనూ అది కాల్చేస్తుంది. పర్వతాల పునాదులను రగులబెడుతుంది.

ద్వితీయోపదేశ కాండము 32:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారిపై విపత్తుల సమూహం తెప్పిస్తాను. వారి మీదికి నా బాణాలు వదులుతాను.

ద్వితీయోపదేశ కాండము 32:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు కరువుతో అల్లాడతారు. ఒళ్ళు కాలే మంటతో, పెను నాశనంతో క్షీణిస్తారు. దుమ్ములో పాకే వాటి విషాన్నీ అడివి జంతువుల కోరలనూ వారిమీదికి రప్పిస్తాను.

ద్వితీయోపదేశ కాండము 32:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బయట కత్తి చావు తెస్తుంది. పడక గదుల్లో భయం పీడిస్తుంది. యువకులూ, కన్యలూ, పసికందులూ, నెరిసిన వెంట్రుకలున్నవారూ నాశనం అవుతారు.

ద్వితీయోపదేశ కాండము 32:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వాళ్ళను చాలా దూరం విసిరేస్తాను. వాళ్ళ జ్ఞాపకాలు మానవ జాతిలో లేకుండా తుడిచేస్తాను.

ద్వితీయోపదేశ కాండము 32:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కానీ అలా ఎందుకు చెయ్యలేదంటే, వాళ్ళ విరోధులు రెచ్చిపోతారేమో, వాళ్ళ విరోధులు అపార్థం చేసుకుని, ‘పైచెయ్యి మనదే, ఇది చేసింది యెహోవా కాదు’ అంటారేమో.”

ద్వితీయోపదేశ కాండము 32:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇశ్రాయేలు తెలివిలేని ప్రజ. వాళ్ళలో వివేకమే లేదు.

ద్వితీయోపదేశ కాండము 32:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారికి జ్ఞానముంటే, దీన్ని వాళ్ళు అర్థం చేసుకుంటే, వాళ్లకు రాబోయే ఆపద గమనించుకుంటే,

ద్వితీయోపదేశ కాండము 32:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారి ఆశ్రయదుర్గం వారిని అమ్మి వేయకపోతే, యెహోవా వారిపై మనకు విజయాన్నివ్వకపోతే, ఒకడు వేయి మందిని ఎలా తరుముతాడు? పదివేల మందిని ఇద్దరు ఎలా పారదోలతారు?

ద్వితీయోపదేశ కాండము 32:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మన శత్రువుల బండ మన ఆశ్రయదుర్గం లాంటిది కాదు. మన శత్రువులే దీనికి సాక్షులు.

ద్వితీయోపదేశ కాండము 32:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారి ద్రాక్షచెట్టు సొదొమ ద్రాక్ష చెట్టు నుంచి వచ్చింది. అది గొమొర్రా పొలాల్లోనిది. వారి ద్రాక్షపళ్ళు విషపు ద్రాక్షపళ్ళు. వాటి గెలలు చేదు.

ద్వితీయోపదేశ కాండము 32:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారి ద్రాక్షారసం పాము విషం. నాగుపాముల క్రూర విషం.

ద్వితీయోపదేశ కాండము 32:34 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇది నా రహస్య ఆలోచన కాదా? నా ఖజానాల్లో భద్రంగా లేదా?

ద్వితీయోపదేశ కాండము 32:35 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారి కాలు జారే కాలంలో పగ తీర్చే పని నాదే. ప్రతిఫలమిచ్చేది నేనే. వారి ఆపద్దినం దగ్గర పడింది. వారి అంతం త్వరగా వస్తుంది.

ద్వితీయోపదేశ కాండము 32:36 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బానిస గానీ, స్వతంత్రుడు గానీ, మరెవరూ మిగలకపోతే, వారికి ఆధారం లేనప్పుడు చూసి, తన సేవకులకు జాలి చూపిస్తాడు, తన ప్రజలకు యెహోవా నిర్ణయం చేస్తాడు.

ద్వితీయోపదేశ కాండము 32:37 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడాయన వారి దేవుళ్ళు ఎక్కడ? వాళ్ళు నమ్ముకున్న బండ ఏది?

ద్వితీయోపదేశ కాండము 32:38 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారికి ఆధారం లేనప్పుడు చూసి, వారి నైవేద్యాల కొవ్వు తిని, వారి పానీయార్పణ ద్రాక్షారసాన్ని తాగిన వారి దేవుళ్ళు ఎక్కడ? వారు లేచి మీకు సాయపడనివ్వండి. వారినే మిమ్మల్ని కాపాడనివ్వండి.

ద్వితీయోపదేశ కాండము 32:39 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
చూడండి. నేనే, నేను మాత్రమే దేవుణ్ణి. నేను తప్ప మరో దేవుడు లేడు. చంపేది నేనే, బతికించేది నేనే. దెబ్బ కొట్టేది నేనే, బాగు చేసేది నేనే. నా చేతిలో నుంచి విడిపించేవాడెవడూ లేడు.

ద్వితీయోపదేశ కాండము 32:40 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆకాశం వైపు నా చెయ్యెత్తి నేనెప్పటికీ జీవిస్తున్నట్టుగా పని చేస్తాను.

ద్వితీయోపదేశ కాండము 32:41 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను తళతళలాడే నా కత్తి నూరి, నా చెయ్యి న్యాయం తీర్చడం మొదలెడితే, నా శత్రువులకు ప్రతీకారం చేస్తాను. నన్ను ద్వేషించే వారికి ప్రతిఫలమిస్తాను.

ద్వితీయోపదేశ కాండము 32:42 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా బాణాలు రక్తంతో మత్తెక్కి పోయేలా చేస్తాను. నా కత్తి, మాంసం భక్షిస్తుంది! చచ్చిన వారి రక్తాన్నీ, బందీల రక్తాన్నీ, శత్రువు అధికారులనూ అవి తింటాయి.

ద్వితీయోపదేశ కాండము 32:43 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇతర రాజ్యాల ప్రజలారా, దేవుని ప్రజలతో ఆనందించండి. వధకు గురి అయిన తన సేవకుల రక్తానికి ఆయన పగ తీరుస్తాడు. తన విరోధులకు ప్రతీకారం చేస్తాడు. తన దేశం కోసం, తన ప్రజల కోసం ప్రాయశ్చిత్తం చేస్తాడు.

ద్వితీయోపదేశ కాండము 32:44 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మోషే, నూను కొడుకు యెహోషువ ఈ పాటలోని పదాలన్నీ ప్రజలకు పాడి వినిపించారు.

ద్వితీయోపదేశ కాండము 32:45 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మోషే ఈ పాట ఇశ్రాయేలు ప్రజల కోసం పాడి ముగించాడు.

ద్వితీయోపదేశ కాండము 32:46 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తరువాత అతడు వారితో ఇలా చెప్పాడు, దీనికి మీరే సాక్ష్యం. ఈ రోజు నేను పలికిన మాటలన్నీ మీ మనస్సుల్లో నింపుకుని, ఈ ధర్మశాస్త్ర ప్రమాణాలన్నీ అనుసరించి నడుచుకోవాలని మీ సంతానానికి ఆజ్ఞాపించాలి.

ద్వితీయోపదేశ కాండము 32:47 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇవి మీకు నిష్ఫలమైన మాటలు కావు, ఇవి మీకు జీవదాయకమైనవి. మీరు యొర్దాను దాటి స్వాధీనం చేసుకోబోతున్న దేశంలో దీన్ని బట్టి మీరు దీర్ఘాయుష్మంతులవుతారు.

ద్వితీయోపదేశ కాండము 32:48 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అదే రోజు యెహోవా మోషేతో ఇలా చెప్పాడు, యెరికో ఎదుట ఉన్న మోయాబు దేశంలోని అబారీం అనే ఈ పర్వతం,

ద్వితీయోపదేశ కాండము 32:49 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అంటే నెబో కొండ ఎక్కు. నేను ఇశ్రాయేలీయులకు వారసత్వంగా ఇస్తున్న కనాను దేశాన్ని నువ్వు చూస్తావు.

ద్వితీయోపదేశ కాండము 32:50 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ సోదరుడు అహరోను, హోరు కొండ మీద చనిపోయి తమ పితరుల దగ్గరికి చేరినట్టు, నువ్వు ఎక్కబోతున్న కొండ మీద చనిపోయి, నీ పితరుల దగ్గరికి వెళ్తావు.

ద్వితీయోపదేశ కాండము 32:51 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎందుకంటే, మీరు సీను ఎడారిలో కాదేషు మెరీబా నీళ్ల దగ్గర ఇశ్రాయేలు ప్రజల మధ్య నన్ను ఘనపరచక ఇశ్రాయేలు ప్రజల మధ్య నా మీద తిరుగుబాటు చేశారు.

ద్వితీయోపదేశ కాండము 32:52 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నువ్వు ఆ దేశాన్ని దూరం నుంచి చూస్తావు. నేను ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తున్న ఆ దేశంలో నువ్వు అడుగుపెట్టవు.

Available Bible Translations

American Standard Version (ASV)
Deuteronomy 32 (ASV) »
King James Version (KJV)
Deuteronomy 32 (KJV) »
GOD’S WORD® (GW)
Deuteronomy 32 (GW) »
Berean Bible (BSB)
Deuteronomy 32 (BSB) »
World English Bible (WEB)
Deuteronomy 32 (WEB) »
French Bible (LSG)
Deutéronome 32 (LSG) »
German Bible (LUTH1912)
Deuteronomium 32 (LUTH1912) »
Hebrew Bible (HEB)
דברים 32 (HEB) »
Portuguese Bible (BSL)
Deuteronômio 32 (BSL) »
Spanish Bible (RVA)
Deuteronomio 32 (RVA) »
Italian Bible (RIV)
Deuteronomio 32 (RIV) »
Chinese Simplified (CUVS)
申 命 记 32 (CUVS) »
Chinese Traditional (CUVT)
申 命 記 32 (CUVT) »
Swedish Bible (SV1917)
5 Mosebok 32 (SV1917) »
Hungarian Bible (KAR)
5 Mózes 32 (KAR) »
Japanese Bible (JPN)
申命記 32 (JPN) »
Norwegian Bible (NORSK)
5 Mosebok 32 (NORSK) »

ద్వితీయోపదేశ కాండము (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List